French healthcare workers fined at Paris hospital protest

నిరసనకు దిగిన వైద్య సిబ్బందికి జరిమానా…ముగ్గురు అరెస్ట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కోవిడ్-19 కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందువరుసలో నిలబడి అహర్నిశలు కష్టపడుతున్న హెల్త్ కేర్ వర్కర్లకు ఫ్రెంచ్ పోలీసులు ఊహించని ఝలక్ ఇచ్చారు. తమ సమస్యలను తీర్చాలని పారిస్ లోని ఓ హాస్పిటల్ బయట నిరసనకు దిగిన దాదాపు 50 మంది వైద్య సిబ్బందికి అక్కడి పోలీసులు జరిమానా విధించడంతో పాటు కొందరిని అరెస్ట్‌ కూడా చేశారు. 

ఫ్రెంచ్ మీడియా తెలిపిన ప్రకారం.. కరోనా వైరస్ వ్యాప్తికి ముందు నుంచే పారిస్‌ లోని రాబర్ట్ డెబ్రే హాస్పిటల్ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది. కరోనా వ్యాప్తితో అక్కడి సిబ్బందిపై పనిభారం  పెరిగింది. దీనికి తోడూ వేతనాల్లో కోత, వైద్య పరికరాల కొరత వంటి సమస్యలతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో 400 మందికి పైగా డాక్టర్లు, నర్సులు, సహాయక సిబ్బంది నిరసనకు దిగారు.

హాస్పిటల్ కు మెరుగైన నిధులు మంజూరు చేయాలని,వేతనాలు పెంచాలని,హెల్త్ కేర్ వర్కర్లకు మెరుగైన వర్కింగ్ కండీషన్స్ కోరుతూ హాస్పిటల్ ఎదుట రోడ్డుపై ర్యాలీ తీశారు.కరోనా మహమ్మారితో వైద్య సిబ్బందిపై పనిభారం అధికమైందని నిరసనల్లో పాల్గొన్న వైద్యులు తెలిపారు. అంతేకాకుండా సరైన వైద్య పరికరాలు లేకపోవడంతో తమకు కరోనా వ్యాపించే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే నిరసనకారులు సోషల్ డిస్టెన్స్ విషయంలో నియమాలను ఉల్లంఘించారని పారిస్‌ పోలీసులు తెలిపారు. అక్కడున్నవారిని చెదరగొట్టడానికి ప్రయత్నించగా, అందుకు తిరస్కరించిన వారికి అక్కడే 150 డాలర్ల  జరిమానా విధించారు. జరిమానా కట్టని ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. మే ప్రారంభం నుంచే ఫ్రాన్స్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలను సడలిస్తూ వస్తోంది. కొన్ని విభాగాల్లో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. షాపులు, పాఠశాలలను కూడా తెరిచేందుకు అవకాశం ఇచ్చింది.

Read:  ముందు జాగ్రత్త.. 30కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ ఆర్డర్ చేసిన అమెరికా

Related Posts