సీసాల్లో సముద్రపు ఇసుక చోరీ..భారీగా జరిమానా విధించిన కోర్టు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సముద్రపు ఇసుక. ఇల్లు కట్టుకోవటానికి పనిచేయదు కానీ..దాన్ని మాత్రం ముట్టుకోకూడదు..కొంచెం కూడా తీసుకెళ్లకూడదు. అది అక్కడి రూల్. ఎక్కడపడితే అక్కడ ఇసుక మేటలు పడి ఉంది కదాని పట్టికెళ్లితే భారీగా జరిమానా తప్పదు. ఎవరు చూస్తారులే అనుకుని పట్టుకెళ్లితే జేబులు ఖాళీయే కాదు ఏకంగా బ్యాంక్ ఎకౌంట్ కూడా ఖాళీ అయిపోయేంత ఫైన్ కట్టాలి.

ఇటలీలో సముద్రపు ఇసుక మీద కఠిన ఆంక్షలు ఉన్నాయన్న విషయం తెలియని ఓ వ్యక్తి భారీగా జరిమానా విధించాక గానీ తెలిసి రాలేదు. ఇటలీలోని సార్డనయాలోని ఓ బీచ్ లో తెల్లగా మెరిసిపోతున్న ఇసుకను చూసి ముచ్చటపడ్డాడు ఓ ఫ్రెంచ్ పర్యాటకుడు . భలేగుందే అనుకుంటూ..సెప్టెంబర్ 1న తన బ్యాగులో నాలుగు పౌండ్ల బరువు కంటే ఎక్కువ ఇసుకను బాటిళ్లలో తీసుకున్నాడు. తరువాత అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లటానికి కాగ్లియారి ఎల్మాస్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడు. అక్కడ తనిఖీల్లో ఆ ఇసుక సీసాలు బయటపడ్డాయి. దీంతో అతన్ని అధికారులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇటాలియన్ ద్వీపంలో తెల్లని కోర్టు అతనికి 1,000 యూరోలు (దాదాపు రూ. 80,000) జరిమానా విధించింది.


దీంతో అతనికి కళ్లు బైర్లు కమ్మాయి. కళ్లు తిరిగిపోయినట్లుగా ఫీలయ్యాడు కోర్టు హాలులోనే.ఈ విషయమై ఇటాలియన్ ద్వీపం ఫారెస్ట్ రేంజర్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘నిందితుడి వద్ద ఇసుక సీసాలను స్వాధీనం చేసుకున్నామనీ.. వాటిని మా ఆపరేటింగ్ రూంలోనే ఉంచామని తెలిపారు.

ఇసుక దొంగలించేవారు గులాబీ లేదా తెల్లని రంగు ఉన్న ఇసుక దొరికే బీచ్‌లను లక్ష్యంగా పెట్టుకుని ఈ చోరీకి పాల్పడుతుంటారని…ఇలా గత ఏడాది ఇక్కడి బీచుల్లో దొరికే ఇసుకను చోరీ చేసి విక్రయిస్తున్న ఒక వెబ్‌సైట్‌ను కనిపెట్టామని..ఇసుక చోరీని నివారించడానికి గత మూడేళ్లుగా కఠిన నిబంధనలు, ఆంక్షలను ప్రవేశపెట్టాం. ఇసుక చోరీలను అరికట్టటానికి పోలీసులతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు.


ప్రజారోగ్యమే భద్రత : సురక్షితమని తేలితే..కరోనా వ్యాక్సిన్, కంపెనీలు సంతకాలు


ఎవరైనా పర్యాటకులు ఇసుకను ఇలా పట్టికెళ్లటానికి యత్నిస్తే..స్థానికులు గానీ..చూస్తే అధికారులను సమాచారం అందించాలని కోరారు. 2018లో కూడా ఓల్బియా నగరం సమీపంలో బీచ్ నుంచి 80 పౌండ్ల ఇసుక పట్టుకెళుతున్న ఓ జంటను పట్టుకున్నామనీ..వారికి 1,000 డాలర్లకుపైగానే ఫైన్ వేశామని తెలిపారు. కాగా…ఇటాలియన్ ద్వీపంలో లభించే తెల్లని ఇసుకను దొంగలించడానకి ప్రయత్నించినవారికి జరిమానాలే కాదు…కొన్ని సందర్భాల్లో జైలుశిక్షలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.


సార్డినియా తీరాల నుంచి ఇసుక తీసుకోవడం చట్టవిరుద్ధమైన చర్యగా పేర్కొంటూ అక్కడి ప్రభుత్వం 2017లో ప్రాంతీయ చట్టాన్ని రూపొందించి ప్రవేశపెట్టింది. ఎవరైనా అక్రమంగా ఇసుకను కలిగి ఉంటే ఇటలీ ప్రభుత్వం 500 యూరోలు (దాదాపు 600 డాలర్లు) నుంచి 3,000 యూరోలు (దాదాపు 3,550 డాలర్లు) మధ్య జరిమానా విధిస్తుంది. ఈ జరిమానా ఇసుక పరిమాణాన్ని బట్టి, దాన్ని దొంగలించిన ప్రదేశంపై ఆధారపడి ఉంటుంది.

Related Tags :

Related Posts :