ఓవైపు శుక్రవారం ప్రార్థనలు.. మరోవైపు బీజేపీ ర్యాలీ..పాతబస్తీలో టెన్షన్.. టెన్షన్‌

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

old town Tension : పాతబస్తీలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఓ వైపు శుక్రవారం ప్రార్థనలు.. మరోవైపు బీజేపీ ర్యాలీకి పిలుపునివ్వడంతో సౌత్‌ జోన్ పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీగా బలగాలను మోహరించారు. పార్టీ ఆఫీస్ నుంచి చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం వరకు బీజేపీ బైక్ ర్యాలీకి పిలుపునిచ్చింది.అయితే ఎన్నికల కోడం అమలులో ఉన్న నేపథ్యంలో.. బీజేపీ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు మరి కాసేపట్లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేరుకునే అవకాశం ఉంది. సంజయ్ ఎక్కడ ఉన్నది ఇంకా పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు.వరద సాయం నిలిపివేయాలని ఈసీ లేఖ రాశారన్న అంశం వివాదంగా మారింది. తాను లేఖ రాయలేదని, మ.12గంటలకు భ్యాగలక్ష్మీ ఆలయంలో ప్రమాణం చేస్తానని బండి సంజయ్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ కూడా ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలి, ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ


భాగ్యలక్ష్మి ఆలయానికి బండి సంజయ్‌ వెళ్లొచ్చన్నారు సీపీ అంజనీకుమార్‌. బండి సంజయ్‌ని తాము ఆపడం లేదన్నారు. బండి సంజయ్‌కి అనుమతి లేదంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దన్నారు. హైదరాబాద్‌ పోలీసులు బండి సంజయ్‌ని అడ్డుకోరని సీపీ స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ర్యాలీలు, ఆందోళనలకు మాత్రం అనుమతి లేదన్నారు.

Related Tags :

Related Posts :