-
Home » వీకెండ్ పిక్స్ : ముద్దుల కూతుళ్లతో స్టార్ క్రికెటర్ల సందడి
Latest
వీకెండ్ పిక్స్ : ముద్దుల కూతుళ్లతో స్టార్ క్రికెటర్ల సందడి
Published
1 month agoon

Popular Indian Cricketers With Their Daughters : స్టార్ క్రికెటర్లు, సెలబ్రిటీలు.. తమ ప్రొఫెషనల్ లైఫ్ విషయంలోనే కాదు.. పర్సనల్ లైఫ్ లోనూ ఎంతో హుందాగా గడిపేస్తుంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. క్రికెటర్ల నుంచి సినిమా సెలబ్రిటీల వరకు అందరూ ఇటు ప్రొఫెషన్.. అటు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తుంటారు. స్టార్ సెలబ్రిటీలు ఖాళీ సమయం దొరికితే చాలు.. తమ ముద్దుల కూతుళ్లతో సరదగా ఆటలు ఆడుతూ సందడి చేస్తుంటారు.
తమ ఫొటోలను సోషల్ అకౌంట్లలో పోస్టు చేసి అభిమానులతో కూడా పంచుకుంటుంటారు. కొంతమంది స్టార్ క్రికెటర్లు తమ ముద్దుల కూతుళ్లతో సరదాగా గడిపిన కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒకప్పటి క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ నుంచి ఇప్పటి మిస్టర్ కూల్ ధోని వరకు పాపులర్ ఇండియన్ క్రికెటర్ల తమ కూతుళ్లతో సరదాగా గడిపిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
కపిల్ దేవ్- అమియా :
క్రికెట్ లెజెండ్.. సీనియర్ క్రికెటర్ కపిల్ దేవ్.. టీమిండియాకు వరల్డ్ కప్ సాధించిన పెట్టిన ఫస్ట్ ఇండియన్ క్రికెట్ కెప్టెన్ కూడా. ఇప్పుడా కపిల్ దేవ్ తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన కూతురితో ఉన్న బాండింగ్ ఎలా ఉందో ఈ ఫొటో చూస్తే తెలిసిపోతుంది. కపిల్ దేవ్, ఆయన సతీమణి రోమి దేవ్ ముద్దుల కూతురు అమియా కపిల్ దేవ్.. వీరికి 1996లో అమియా పుట్టింది. భార్యాకూతురితో ముగ్గురు కలిసి దిగిన ఫొటోను కపిల్ దేవ్ షేర్ చేశారు.
హర్భజన్ సింగ్ – హినాయనా :
ఇండియన్ సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్.. ముద్దుగా బజ్జీగా అని పిలుచుకునే హర్భజన్.. క్రికెట్ ప్రొఫెషన్ తో పాటు తన ఫ్యామిలీ కోసం కూడా కొంచెం సమయాన్ని కేటాయిస్తాడు. భారత క్రికెటర్ సెలబ్రిటీల్లో హర్భజన్ కూడా తన కూతురితో సరదాగా ఆడుకోవడమంటే ఎంతో ఇష్టం.. భారత స్పిన్నర్ హర్భజన్, సతీమణి గీతా బాస్రా దంపతులకు 2016, జూలై 27న హినాయనా జన్మించింది. ముద్దుల కుమార్తె, భార్య గీతాతో దిగిన స్వీట్ మెమెరీ పిక్ ఇది..
సౌరవ్ గంగూలీ-సానా సౌరవ్ :
బెంగాల్ టైగర్.. వెటరన్ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి కూడా తన కుమార్తె సానా సౌరవ్‌తో ఎక్కువ బాండింగ్ ఉంటుంది. ముద్దుల కుమార్తె సానా అంటే ఎంతో ఇష్టం.. తనకు సానా సౌరవ్ దేవుడు ప్రసాదించిన గొప్ప బహుమతి అంటూ ఎప్పుడూ చెబుతుంటాడు. తండ్రీకూతురి మధ్య కూలెస్ట్ బాండింగ్ ఉంటుంది. ఒక యాడ్ కోసం ఇద్దరూ కలిసి స్ర్కీన్ స్పేస్ కూడా షేర్ చేసుకున్నారు. ఇద్దరూ కలిసి దిగిన ఫొటో మెమరబుల్ ఫొటో ఇది..
సురేశ్ రైనా-గ్రేసియా రైనా :
ఇండియన్ క్రికెటర్లలో సురేశ్ రైనా కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. తన ప్రొఫెషన్ తో పాటు పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఎక్కువగా ఫొటోలను షేర్ చేస్తుంటాడు. ఎప్పుడైతే తమ ప్రపంచంలోకి గారాల పట్టి గ్రేసియా వచ్చిందో ఆ క్షణం తమకెంతో స్పెషల్ అంటూ రైనా అతడి భార్య ప్రియాంకా ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. తమకు కూతురే పుట్టాలని దేవున్ని కోరుకున్నామని, అలాగే కూతుర్నే దేవుడు మాకిచ్చాడని రైనా అంటుంటాడు. గారాల పట్టి గ్రేసియాను ఎత్తుకున్న ఫొటోను షేర్ చేశాడు. ఇదే ఆ ఫొటో..
సచిన్ టెండూల్కర్- సారా టెండూల్కర్ :
క్రికెట్ దేవుడు. లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్.. సారాతో స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది. 1997, అక్టోబర్ 12న సచిన్, అంజలీ దంపతులు తమ జీవితంలోకి సారాను ఆహ్వానించారు. సచిన్ తన కుమార్తెతో కలిసి దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రోహిత్ శర్మ-సమారియా శర్మ :
టీమిండియా క్రికెటర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడుతుంటాడు. అందులోనూ గారాల పట్టి సామారియాతో సమయమే తెలియదు. తాను కూడా చిన్నపిల్లాడిలా మారి కూతురితో ఆడుకుంటాడు. తన ముద్దుల కుమార్తెతో ఉన్న మెమెరబుల్ పిక్ ఒకటి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు రోహిత్.
ఎంఎస్ ధోనీ-జీవా :
టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్.. మహేంద్రసింగ్ ధోనీ.. కుమార్తె జీవాతో ఎక్కువ సమయం గడుపుతుంటాడు. ఇప్పటికే జీవాతో కలిసి ధోనీ ఆడిన వీడియోలు ఎన్నో ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. ధోనీ, గారాల పట్టి జీవాల మధ్య బాండింగ్ గురించి చెప్పన్కర్లేదు. ధోనీ, సాక్షి దంపతులకు 2015, ఫిబ్రవరి 6న జీవా పుట్టింది. ధోనీ సతీమణి సాక్షి కూడా ఎక్కువగా ధోనీ, జీవాల మెమెరబుల్ మూవెంట్స్ సంబంధించి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది..
You may like
-
నటుడిగానూ హర్భజన్ సింగ్ ఆడుకుంటున్నాడు.. ‘ఫ్రెండ్ షిప్’ నిర్మాత ఏ.ఎన్.బాలాజీ..
-
ఐపీఎల్ వేలం..164 మంది ఇండియన్ క్రికెటర్లు, 125 మంది విదేశీ ఆటగాళ్లు
-
చెన్నై టెస్టు : అశ్విన్ మాయాజాలం, ఇంగ్లండ్ 134 రన్లు, ఆలౌట్
-
నాల్గవ రోజు ముగిసిన ఆట.. గెలుపు కోసం పోరాడుతారా? స్కోరు 39/1
-
సచిన్, కోహ్లి, అక్షయ్, లతా మంగేష్కర్ ట్వీట్లపై ఇంటెలిజెన్స్ దర్యాఫ్తు.. మహా ప్రభుత్వం సంచలన నిర్ణయం
-
కేంద్రం వల్లే సచిన్,లతా మంగేష్కర్ పరువు పోయింది

ఇంద్రకీలాద్రిపై ఏం జరుగుతోంది ?

నాకు పదవి ఎందుకు ఇవ్వలేదో జగన్నే అడగండి

ఏపీ, తెలంగాణ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో పట్టాలపైకి మరో 22 ప్రత్యేక రైళ్లు

ప్రపంచంలోనే కాస్ట్లీ : ప్లేటు బిర్యానీ రూ.20 వేలు..!!

60 ఏళ్ళు పై బడిన వారికి కరోనా టీకా

పరువాల పూనమ్ బజ్వా ఫొటోస్

‘ఉప్పెన’ సక్సెస్ సెలబ్రేషన్స్..

అనన్య నాగళ్ల ఫొటోస్

ప్రగతి ఫొటోలు చూశారా!

‘లీడర్’ హీరోయిన్ ప్రియా ఆనంద్ ఫొటోస్

ఇంద్రకీలాద్రిపై ఏం జరుగుతోంది ?

నాకు పదవి ఎందుకు ఇవ్వలేదో జగన్నే అడగండి

60 ఏళ్ళు పై బడిన వారికి కరోనా టీకా

ఉచిత మంచి నీరుపై గ్రేటర్ వాసులు అయోమయం
