from-the-coronavirus-only-god-can-save-us-says-karnataka-health-minister

కరోనా నుంచి దేవుడే మనల్ని రక్షించాలి : ఆరోగ్య మంత్రి వ్యాఖ్యలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా మహమ్మారి నుంచి ఆ దేవుడే మనల్ని కాపాడాలి అంటూ కర్ణాటక ఆరోగ్య మంత్రి బీ శ్రీరాములు వ్యాఖ్యానించారు.దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనేఉన్నాయి…ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అందరూ మాస్కులు తప్పకుండా పెట్టుకోవాలని..భౌతిక దూరం పాటించాలని సూచించారు. కాగా..కరోనా నుంచి ‘దేవుడు మాత్రమే మనల్ని రక్షించాలి’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీలో కూడా అంతర్గతంగా చర్చనీయాంశమయ్యాయి.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయని… మహమ్మారికి పేద, ధనిక, కులం, మతం లేదని ఆయన చెప్పారు. దీనికి స్థాయి, అంతస్తు అనే తేడా లేదని అన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజుల వ్యవధిలోనే డబుల్ అవుతాయని తెలిపారు. కేవలం భగవంతుడు మాత్రమే మనల్ని కాపాడగలడని అన్నారు. ఈ వ్యాఖ్యలతో కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే దేవుడే కాపాడాలని మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ అసమర్థకు నిదర్శమని కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్ విమర్శించారు. ఈ విమర్శలపై మంత్రి శ్రీరాములు తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ.. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజల సహకారంతోపాటు దేవుడు దయ కూడా మనకు కావాలని అనే ఉద్ధేశ్యంతోనే తాను అలా వ్యాఖ్యానించానని కానీ తన మాటలను అపార్థం చేసుకోవద్దని బుధవారం రాత్రి వీడియో ద్వారా తెలిపారు.

కాగా..కర్ణాటకలో 47,253 మంది కరోనా బారిన పడ్డారు. దాదాపు 928 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో కర్ణాటక నాలుగో స్థానంలో ఉంది. మహారాష్ట్ర 2.75 లక్షల కేసులతో మొదటి స్థానంలో ఉండగా, తమిళనాడు 1.51 లక్షలు, ఢిల్లీ 1.16 లక్షల కేసులతో మూడో స్థానంలో ఉంది.

Related Posts