లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

Be Alert : మ‌ళ్లీ లాక్ డౌన్..నాలుగు జిల్లాలో

Published

on

full lockdown chennai in four dist

క‌రోనా వైర‌స్ రాకాసి ఇంకా త‌గ్గ‌నంటోంది. అంత‌కంత‌కు విజృంభిస్తోంది. వేల సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. మ‌ర‌ణాల సంఖ్య కూడా అలాగే ఉంది. అయితే..భార‌త‌దేశంలో రిక‌వ‌రీ పెరుగుతుండ‌డం శుభ‌ప‌రిణామ‌ని వెల్ల‌డిస్తున్నారు. అయితే..వివిధ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య మ‌రింత పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. దీనికి లాక్ డౌన్ శ‌ర‌ణ్య‌మ‌ని కొంత‌మంది వెల్ల‌డిస్తుండ‌గా..అది క‌రెక్టు కాద‌ని మ‌రికొంద‌రు స్ప‌ష్టం చేస్తున్నారు.

కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ కు ఒకే అంటున్నాయి. నాలుగు జిల్లాలో లాక్ డౌన్ విధించాల‌ని ఓ రాష్ట్రం నిర్ణ‌యించింది. ఎక్క‌డ‌..తెలంగాణ రాష్ట్రంలో అయితే..కాదు క‌దా..అని అనుకుంటున్నారా..కాదు..పొరుగున్న ఉన్న త‌మిళ‌నాడు రాష్ట్రంలో…

త‌మిళ‌నాడు రాష్ట్రంలో క‌రోనా కేసులు అధిక‌మౌతున్నాయి. రోజు రోజుకి భారీగా కేసులు పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. దీంతో సీఎం ప‌ళ‌ని స్వామి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌ళ్లీ లాక్ డౌన్ విధించాల‌ని డిసైడ్ అయ్యారు. కానీ…మొత్తం రాష్ట్రంలో కాకుండా..కేవ‌లం నాలుగు జిల్లాల‌కు ప‌రిమితం చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

గ్రేట‌ర్ చెన్నై, చెంగ‌ల్ప‌ట్టు, తిరువ‌ల్లూరు, కాంచీపురం జిల్లాల్లో 2020, జూన్ 19వ తేదీ నుంచి…30వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. ఉద‌యం 6 గంట‌ల నుంచి..మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే నిత్యావ‌సర స‌రుకులు..కొనుగోలుకు మాత్ర‌మే అనుమ‌తినివ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. 

ఈ 12 రోజుల్లో రెండు ఆదివారాలు రానున్నాయి. ఈ రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమ‌లు చేయ‌నున్నారు. ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేటు వాహ‌నాల‌కు అనుమ‌తినివ్వ‌మ‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ చెన్నై నుంచి బ‌య‌ట‌కు వెళ్లాల‌ని అనుకుంటే..ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన‌..ఈ-పాస్ తీసుకోవాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *