Samsung Days sale : ఇండియాలో రూ. 9వేలు డిస్కౌంట్‌‌తో Galaxy Note20 స్మార్ట్ ఫోన్ ఆఫర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సౌత్ కొరియన్ స్మార్ట్ ఫోన్ టెక్ దిగ్గజం ‘Samsung Days Sale’ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఆన్‌లైన్ సేల్‌లో భాగంగా శాంసంగ్ తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకే అందిస్తోంది. ఫ్లాగ్ షిప్ ఫోన్లలో ఒకటైన Galaxy Note 20 స్మార్ట్ ఫోన్ ధర రూ.62,999లకే అందుబాటులో ఉంది. అలాగే గెలాక్సీ నోట్20 Ultra 5G స్మార్ట్ ఫోన్ కూడా ఆఫర్ చేస్తోంది.



Galaxy Note 20 వేరియంట్ పై రూ.9వేల వరకు వినియోగదారులు డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాదు.. HDFC బ్యాంకు కార్డులతో కొనుగోలుచేసే వినియోగదారులు రూ.6 వేల వరకు క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. మొత్తంగా ఈ గెలాక్సీ నోట్ 20 ఫోన్ తగ్గింపు ధరతో రూ.62,999లకే సొంతం చేసుకోవచ్చు. ఈ మేరకు శాంసంగ్ కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.



శాంసంగ్ అందిస్తోన్న ఈ Samsung Days sale ఆఫర్ మరో వారం (సెప్టెంబర్ 23 వరకు) మాత్రమే అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ అందిస్తోన్న గెలాక్సీ నోట్ 20 స్మార్ట్ ఫోన్‌ mystic bronze, mystic green and mystic blue మూడు కలర్లలో లభ్యం కానుంది. Galaxy Note 20 స్మార్ట్ ఫోన్‌పై ‘Samsung Day’ ఆఫర్లు Samsung.com, Samsung store లీడింగ్ ఆన్ లైన్ పోర్టల్స్, రిటైల్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది.



6.7 అంగుళాల గెలాక్సీ నోట్ 20లో (8GB+256GB) ఒరిజినల్ ధర రూ.77,999 ఉండగా.. మరో వేరియంట్.. 6.9 అంగుళాల గెలాక్సీ నోట్20 Ultra 5G (12GB+256GB) స్మార్ట్ ఫోన్ ధర ఇండియాలో రూ.1,04,999లకు అందుబాటులో ఉంది.

Galaxy Note 20 ఫీచర్లు :
* 6.7-అంగుళాల full-HD+ (1,080×2,400 pixels) Infinity-O Super AMOLED+ plat display
* 60Hz refresh rate, 20:9 aspect ratio
* octa-core Exynos 990 లేదా Qualcomm Snapdragon 865+ SoC
* 8GB RAM + 256GB onborad Storage
* Micro-SD card (not expandable)
* Galaxy Note20 Ultra 5G (12GB+256GB)

Related Posts