లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

గల్వాన్ హీరో కల్నల్ సంతోష్ బాబుకు “మహావీర చక్ర” అవార్డు

Published

on

Galwan Hero గతేడాది జూన్-15న తూర్పు లఢఖ్ లోని వాస్తవాదీన రేఖ వద్ద గల గల్వాన్ వ్యాలీలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుకు కేంద్రం అరుదైన అవార్డు అందించి ఆయన త్యాగాన్ని గౌరవించింది. ఆయనకు దేశపు రెండవ అత్యున్నత యుద్ధకాల శౌర్యపురస్కారం మహా వీర చక్ర అవార్డును అందించనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. రేపు రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ఈ అవార్డును అందించనున్నారు.

లఢఖ్ ఈశాన్య ప్రాంతంలో భారత భూభాగంపైకి అక్రమంగా చొచ్చుకుని రావడానికి ప్రయత్నించిన పీఎల్ఏ బలగాలను నిరోధించే సమయంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. 18 బిహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్‌గా ఉన్న కల్నల్ సంతోష్ బాబు సారథ్యంలో జవాన్లు చైనా సైనికుల చొరబాటు యత్నాన్ని అడ్డుకోగలిగారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి.. వారిని వెనక్కి తరిమి కొట్టగలిగారు. ఈ ఘర్షణల్లో రెండు వైపులా ప్రాణనష్టం సంభవించింది. చైనా తరఫున 50 మందికి పైగా పీఎల్ఏ సైనికులు మరణించినట్లు సమాచారం ఉన్నప్పటికీ.. ఆ దేశ సైన్యాధికారులు దాన్ని ధృవీకరించలేదు.