విఘ్నాలు పోవాలి..విజయాలు రావాలి, ప్రజలకు హ్యాపీ వినాయక చవితి – సీఎం జగన్

  • Published By: madhu ,Published On : August 21, 2020 / 01:09 PM IST
విఘ్నాలు పోవాలి..విజయాలు రావాలి, ప్రజలకు హ్యాపీ వినాయక చవితి – సీఎం జగన్

ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఏపీ సీఎం ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.



విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, అభివృద్ధిలో ముందడుగు వేయాలని అభిలాషించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాల అమలకు ఎదురవుతున్న ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోవాలని సీఎం జగన్ ఆకాక్షించారు.

మరోవైపు…వినాయక చవితి సంబంధించి ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎవరికి వారు పండుగను ఇంట్లో జరుపుకోవాలని ప్రభుత్వం సూచించింది. బహిరంగ ప్రదేశాల్లోకి బదులు ఇంట్లోనే పూజలు చేసుకోవాలని, విగ్రహాల పొడవు విషయంలో ప్రజలు ఆలోచించుకోవాలని తెలిపింది. కరోన వైరస్ వ్యాపిస్తుండడంతో ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.



పూజా సామాగ్రీ కొనుక్కోనేందుకు మార్కెట్ కు వెళితే..సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి అని సూచించారాయన. బహిరంగ ప్రదేశాల్లో మండపాలు, భారీ విగ్రహాలు ప్రతిష్టించడానికి వీలు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేగాకుండా..నదులు, చెరువుల్లో సామూహిక నిమజ్జనానికి అనుమతి లేదని పరోక్షంగా చెప్పింది. ప్రజలు సహకరంచాలని సూచించింది.