Updated On - 9:02 pm, Sun, 24 January 21
Gang leader Brothers: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ‘గ్యాంగ్ లీడర్’ సినిమాది ప్రత్యేకమైన స్థానం.. విజయ బాపినీడు దర్శకత్వంలో, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మెగాస్టార్ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్, చిరు, విజయశాంతిల కెమిస్ట్రీ, బప్పీ లహరి పాటలు అంత త్వరగా మర్చిపోలేం. 1991 మే 9 న విడుదలైన ఈ చిత్రం ఈ ఏడాది మే 9 నాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ అరుదైన పిక్ చక్కర్లు కొడుతోంది. ‘గ్యాంగ్ లీడర్’ లో మురళీ మోహన్, శరత్ కుమార్ ఇద్దరు చిరంజీవి అన్నయ్యలుగా నటించారు. తాజాగా వీరిద్దరూ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ‘ఆచార్య’ సెట్లో మెగాస్టార్‌ని మీట్ అయ్యారు.
‘గ్యాంగ్ లీడర్’ మూవీలో ఫొటోతో పాటు తాజాగా చిరుతో మురళీ మోహన్, శరత్ కుమార్ తీసుకున్న ఫొటో కూడా జతచేసి #30YRSFORGANGLEADER అనే హ్యాష్ ట్యాగ్‌తో
మరో రెండు నెలల్లో ‘గ్యాంగ్ లీడర్’ 30 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని తెలియజేశారు. ఈ పిక్ మెగా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది.