లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులో సంచలన పరిణామం….

Published

on

గ్యాంగ్ స్టర్ నయూమ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కోంటున్న 25మంది పోలీసు అధికారులకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. నయూంతో 25 మంది పోలీసు అధికారులకు సంబంధాలున్నట్లు… అతని నేరాలకు వీరు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి.

2016 ఆగస్టు 8న షాద్‌నగర్ సమీపంలో గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నయీం చనిపోయిన ఆ తర్వాత.. అతడి చీకటి సామ్రాజ్యపు కోటలను పోలీసులు బద్దలు కొట్టారు. నయీమ్ దందాలు.. దారుణాలు.. దారుణాలు ఒక్కొక‌టిగా బ‌య‌ట‌కురావ‌డం మొద‌లైంది.కేసు దర్యాప్తులో నయీమ్‌కు ఆస్తులకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నయీమ్‌కి రూ.2వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ తేల్చింది. వివిధ ప్రాంతాల్లో 1,019 ఎకరాల భూములు, 29 భవనాలు ఉన్నాయి. వీటితోపాటు 2 కేజీల బంగారం, రూ.2కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కేసు విచారణలో నయీమ్‌కు ఆస్తులకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్ప‌టి వ‌ర‌కు నయీమ్‌కి బ‌య‌ప‌డి త‌న గురించి కానీ, త‌న దందాలు గురించి కాని బ‌య‌ట‌కు చెప్ప‌టానికి ఇష్ట‌ప‌డిన వాళ్లంతా ఒక్కొకరుగా బయటకు వచ్చి…… న‌యీమ్ త‌మ‌ను ఎలా బెదిరించాడో పోలీసులుకు చెప్ప‌డం మొద‌లు పెట్టారు.అలా బాధితుల సంఖ్య పెరుగడంతో నయీమ్ కేసును దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటుచేసింది ప్రభుత్వం. నయీం బాధితుల్లో చాలా మంది పెద్ద వాళ్లు, ప్రముఖులు ఉన్నారని పోలీసులు గుర్తించారు.నయీంకి పోలీసులు ప్రజాప్రతినిధులు సహకరించారని ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పటి పరిస్ధితుల నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆ పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది.కాగా విచారణ అనంతరం నయీంతో పోలీసు అధికారులకు ఉన్న సంబంధాలపై సిట్ కు సరైన ఆధారాలు లభించనందున వారికి క్లీన్ చిట్ ఇచ్చింది. దీనికి సంబంధించి ఫోరం ఫర్ గుడ్ గవర్నెర్స్ సంస్థకు రాష్ట్ర పోలీసుశాఖ సమాచారం అందించింది.వారిలో ఇద్దరూ అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలు ఉన్నారు. కాగా నయీంకేసులో ఆరోపణలు ఎదుర్కోన్న పోలీసు సిబ్బంది

అడిషనల్ ఎస్పీలు:
శ్రీనివాసరావు
చంద్రశేఖర్

డీఎస్పీలు:
సీహెచ్ శ్రీనివాస్
ఎం. శ్రీనివాస్
సాయి మనోహర్
ప్రకాశ్ రావు
వెంకట నరసయ్య
అమరేందర్ రెడ్డి
తిరుపతన్న

సీఐలు:
రవికిరణ్ రెడ్డి
బలవంతయ్య
నరేందర్ గౌడ్
రవీందర్
మస్తాన్
రాజగోపాల్
వెంకటయ్య
కిషన్

ఇంకా
ఐదుగురుకానిస్టేబుళ్లలో

దినేష్
ఆనంద్
సాదత్ మియా
బాలన్న

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *