వైసీపీలోకి మరింత మంది వస్తారు, Gannavaram By-election వచ్చినా నేను రెడీ – వల్లభనేని వంశీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Vallabhaneni Vamsi : టీడీపీ నుంచి మరింత మంది వస్తారని, గన్నవరం ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నేను రెడీ అంటూ…ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విధానాలకు నచ్చక ఎవరూ ఉండరన్నారు.టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తున్న నేతల వెనుక వంశీ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో…2020, సెప్టెంబర్ 20వ తేదీ ఆదివారం 10tv ఆయనతో మాట్లాడింది. ఈ సందర్భంగా టీడీపీ, చంద్రబాబుపై పై పలు విమర్శలు చేశారు. బాబు, లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ భూస్థాపితం అవుతుందని, సీఎం జగన్ విధానాలు నచ్చే వైసీపీలో చేరుతున్నారని వ్యాఖ్యానించారు.టీడీపీ నుంచి వైసీపీలో వస్తున్న వారికి ఆలోచన చేస్తున్నారని, టీడీపీ పార్టీ కనుమరుగవుతుందని భావిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడు అయితే, చంద్రబాబు భూస్థాపిత అధ్యక్షుడని ఎద్దేవా చేశారు. బీజేపీని ఒక్క మాట అనేందుకు బాబు భయపడుతున్నట్లు, బాబుకంటే అబద్ధాల కోరు, నైతిక విలువలు లేని వ్యక్తి రాజకీయాల్లో ఉంటారా అని ప్రశ్నంచారు.ఎన్నికలకు ముందు తొడలు కొడుతూ తిరిగాడు..కదా…ఇప్పుడు ఏమైందని బాబును ఉద్దేశించి అన్నారు. వైసీపీలో చేరుతున్న వారిని బాబే సస్పెండ్ చేయొచ్చు కదా అని సూచించారు. ఎన్నికలకు భయపడే ప్రసక్తే లేదని చెప్పారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.

Related Posts