Home » గరుడవారధి పనుల్లో అపశృతి – కూలిన దిమ్మె, తప్పిన ప్రమాదం
Published
1 month agoon
garuda varadhi bridge accident at tirupathi : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గరుడవారధి నిర్మాణ పనుల్లో సోమవారం అపశృతి చోటు చేసుకుంది. ఆర్టీసి బస్టాండ్ నుంచి అలిపిరి వెళ్లే దారిలో, శ్రీనివాసం అతిధి భవనం వద్ద పిల్లర్లపై దిమ్మె ఏర్పాటు చేస్తుండగా అది పక్కకు ఒరిగి పడిపోయింది. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. కాగా ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.