ఏపీలో మరో గ్యాస్ లీక్..ఒకరు మృతి..మరో ముగ్గురి పరిస్థితి విషమం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీ రాష్ట్రంలో మరో గ్యాస్ లీక్ కలకలం రేపింది. ఏమి జరుగుతుందనే భయంతో వణికిపోతున్నారు. ఇటీవలే విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 13 మంది దాక మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఇంకా కళ్ల ముందే…మెదులుతుండగా..మరో గ్యాస్ లీక్ కావడంతో ఏపీ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

కర్నూలు జిల్లాలోని నంద్యాలో ఉన్న ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీలో అమ్మోనియం గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో ఒకరు చనిపోగా..మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పలు అంబులెన్స్ లు అక్కడ ఏర్పాటు చేశారు. ఐస్ తయారు చేసేటప్పుడు అమ్మోనియం గ్యాస్ వాడే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం.

2020, జూన్ 27వ తేదీ శనివారం SPY Reddy Agro Plant లో ఎప్పటిలాగానే కార్మికులు విధులకు హాజరయ్యారు. మధ్యాహ్న సమయంలో 2 టన్నుల సామర్థ్యం ఉన్న అమ్మోనియం ట్యాంకర్ లో లీకేజీ ఏర్పడింది. ప్రమాదకరమైన గ్యాస్ లీకేజ్ కావడంతో…అందరూ భయపడ్డారు. స్మాట్ లోనే ఒకరు చనిపోయారు. మరో ముగ్గురు అపస్మారకస్థితిలోకి చేరుకున్నారు.

సమాచారం దావానంలా వ్యాపించింది. అక్కడున్న వారు మరోసారి ఎల్జీ పాలిమర్స్ ఘటనను గుర్తు చేసుకున్నారు. ఏమవుతుందోనని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు.

పరిస్థితి విషమంగా ఉన్న వారిని అంబులెన్స్ లో తరలించారు. గ్యాస్ లీకేజీ కాకుండా..ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న యాజమాన్యం..రెస్పాండ్ అయ్యింది. సహాయక చర్యలు చేపడుతున్నారు.

అక్కడున్న స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. విష వాయివుకు దూరంగా ఉండాలని, బయటకు రావొద్దని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు. అందులో పనిచేస్తున్న కార్మికుల కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏమవుతుందోనని భయపడుతున్నారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు.

Related Posts