gay-man-marries-concealing-his-sexual-orientation

నా భర్త Gay..పురుషులతో sexual సంబంధాలు, భార్య ఫిర్యాదు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సార్..నా భర్త గే..పురుషులతో లైంగిక సంబంధాలున్నాయి..ఈ విషయాన్ని బయటకు చెబితే..చంపేస్తానని బెదిరిస్తున్నాడు..తనకు న్యాయం చేయాలని, రక్షించాలని ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అహ్మదాబాద్ లో చోటు చేసుకుంది.



గుజరాత్ లోని గాంధీనగర్ లో ఓ మహిళ లైబ్రేరియన్ గా పని చేస్తున్నారు. 2011లో ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, పెళ్లయిన ఏడాది పాటు తన భర్త బాగానే ఉన్నాడని పోలీసులకు ఇచ్చిన కంప్లైట్ లో వెల్లడించింది. అయితే..కొన్ని రోజుల తర్వాత..తన భర్త పురుషులతో సన్నిహితంగా మెలిగేవాడని, వాట్సాప్ పరిశీలించి చూసి నిలదీయడం జరిగిందన్నారు.

పురుషుల పట్ల..లైంగికాసక్తి అధికమని, సంపాదన కోసం తనను వివాహం చేసుకున్నట్లు చెప్పడని బాధితురాలు వాపోయింది. తన భర్త పని చేసే సంస్థ ఉద్యోగులు (పురుషులు)తో లైంగిక సంబంధాలున్నాయని, దీంతో ఉద్యోగం నుంచి తొలగించారని వెల్లడించింది.



ఉద్యోగం కోల్పోయిన తర్వాత కూడా..పురుషులను ఇంటికి పిలిపించుకుని..లైంగిక వాంఛలు తీర్చుకొనే వాడని తెలిపింది. భర్త పరిస్థితి గురించి అత్తింటి వారికి చెప్పినా..వారు పట్టించుకోలేదని వాపోయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Related Posts