Gay sex now officially punishable by death by stoning in Brunei

కొత్త చట్టం…గే సెక్స్ చేస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

స్వలింగ సంపర్కులు,వ్యభిచారం విషయంలో  బ్రూనే దేశం అత్యంత కఠినమైన ఇస్లాం చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది.వ్యభిచారం, గే సెక్స్ నేరస్థులను చచ్చే వరకు రాళ్ళతో కొట్టడం వంటి శిక్షలు ఈ చట్టాల్లో ఉన్నాయి.బ్రూపైలో సుల్తాన్ ల పాలన కొనసాగుతోంది.అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ సుల్తాన్ హసనల్ బోల్కియా ప్రభుత్వం వెనుకంజ వేయలేదు.తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా దేశాల్లో షరియా చట్టాన్ని జాతీయ స్థాయిలో అమలు చేసిన మొదటి దేశంగా బ్రూనే నిలిచింది. 

బోర్నియో ద్వీపంలోని అతి చిన్న దేశం బ్రూనే లో బుధవారం(ఏప్రిల్-3,2019)అమల్లోకి వచ్చిన షరియా చట్టం ప్రకారం… బ్రూనేలో గే సెక్స్, వ్యభిచారం నేరాలకు పాల్పడేవారిని మరణించే వరకు రాళ్ళతో కొట్టి శిక్షిస్తారు. దొంగతనం చేసినవారి చేతులు, పాదాలు నరికేస్తారు.రేప్, దొంగతనం వంటి నేరాలకు కూడా మరణ శిక్ష విధించే అవకాశం ఉంది. ప్రవక్త మహమ్మద్‌ ను అవమానించడం మరణ శిక్ష విధించదగిన నేరం. ఈ శిక్షలు ముస్లింలకు, ముస్లిమేతరులకు కూడా వర్తిస్తాయి. ఈ శిక్షలు క్రూరమైనవి, అమానుషమైనవని యునైటెడ్ నేషన్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
 

Related Tags :

Related Posts :