సోషల్ డిస్టెన్స్ పాటించడం కోసం మనుషులపై పెప్పర్ స్ప్రే చల్లుతున్న వృద్ధుడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దగ్గరగా వస్తున్న వ్యక్తుల మీద పెప్పర్ స్ప్రే చల్లి COVID-19 సోషల్ డిస్టెన్స్ పాటించేలా చేస్తున్నాడో 71 సంవత్సరాల వృద్ధుడు. అతని వరకూ ఇది కరెక్టే అనిపిస్తున్నా సొసైటీకి ఇబ్బంది కలిగిస్తుండటంతో జర్మన్ పోలీసులు రంగంలోకి దిగారు. ఉదయం సమయంలో తనకు దగ్గరగా వచ్చిన సైకిలిస్టులు, జాగర్ల మీద పెప్పర్ స్ప్రే కొట్టినట్లు ఆచెన్ వెస్టరన్ సిటీ పోలీసులు తెలిపారు.

వెంటనే వారు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో.. పాట్రోలింగ్ వచ్చి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతను కేవలం కరోనా డిస్టెన్స్ కోసమే ప్రయత్నిస్తున్నాడని అర్థం చేసుకున్నారు. ఇతరులకు హాని కలిగించేలా చేస్తున్నందుకు అతనిపై క్రిమినల్ చర్యలు చేస్తున్నట్లుగా కేసులు నమోదు చేశారు.ఆన్ లైన్ లో పరిచయం……మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తుల అత్యాచారం


వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ప్రజలు కనీసం 3.3 అడుగుల దూరం పాటించాలని ఆదేశించింది. దాంతోపాటు మాస్క్ ధరిస్తేనే కరోనా వ్యాప్తి వేగం తగ్గించగలమని సూచించింది. చాలా చోట్ల అధికారులు మాత్రం 1.5మీటర్ల దూరంతో సరిపెడుతున్నారు. కరోనావైరస్ వయస్సులో పెద్ద వాళ్లపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం, రక్తపోటు అధికంగా ఉండటంతో త్వరగా వైరస్ బారిన పడుతున్నారు.

Related Tags :

Related Posts :