Home » మనుషుల్లో సాధ్యమేనా? : వెన్నుముక విరిగి కాళ్లు చచ్చుబడిన ఎలుకను మళ్లీ నడిపించిన జర్మన్ సైంటిస్టులు
Published
1 month agoon
German scientists make paralyzed mice walk again : పక్షవాతంతో కాళ్లు చచ్చుబడిన ఎలుకను తిరిగి నడిపించారు జర్మన్ సైంటిస్టులు. వెన్నుపూస విరగడంతో ఎలుక నడవలేకపోతోంది. ఎలుక బ్రెయిన్లో డిజైనర్ ప్రొటీన్ ఇంజెక్ట్ చేయడం ద్వారా అది ఎప్పటిలానే మాములుగా లేచి నడుస్తోంది. సాధారణంగా మనుషుల్లో స్పినల్ కార్డ్ (వెన్నుముక) స్పోర్ట్స్ ఆడే క్రీడాకారుల్లో లేదా రోడ్డు ప్రమాదాల్లో తరచుగా విరగడం జరుగుతుంటుంది. వెన్నుముక విరగడం ద్వారా మంచానికే పరిమితం కావాల్సి వస్తుంది. ఎందుకంటే.. కండరాలకు మెదడు మధ్య జనెటిక్ సమాచారాన్ని చేరవేసే నాడి ఫైబర్ కణాలన్నీ పనిచేయవు. కాళ్లు చచ్చుబడిపోతాయి. తిరిగి లేచి నడవలేరు. కానీ, ఈ విషయంలో రుహ్ యూనివర్శిటీటీ బోచుమ్ రీసెర్చర్లు ఎలుకపై ప్రయోగం చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.
డిజైనర్ ప్రొటీన్ ద్వారా ఎలుకలోని చచ్చుబడిన వెన్నుముక నాడి కణాలను ఉత్తేజపరిచేలా చేశారు. తద్వారా లేవలేని ఎలుక నిలబడి నడవసాగింది. ఈ డిజైనర్ ప్రోటీన్ కేవలం నాడి కణాలను ఉత్తేజపరడానికి మాత్రమే కాదు.. బ్రెయిన్ ద్వారా నాడి కణాలకు సమాచారాన్ని చేరవేస్తూ ప్రోటీన్‌ను తామంతట తామే ఉత్పత్తి చేయగలవని పరిశోధక బృందం పేర్కొంది. ఎలుకలో భారీ మొత్తంలో నాడి కణాలను తిరిగి పునరుత్తేజం చెందించడం ద్వారా అది సులభంగా లేచి నడవగలిగిందని రీసెర్చర్లు తెలిపారు. డిజైనర్ ప్రోటీన్ ఇంజెక్ట్ చేసిన రెండు నుంచి మూడు వారాల్లో నడవలేని ఎలుకలు లేచి నడవడం మొదలుపెట్టాయని పరిశోధకులు పేర్కొన్నారు.
ఈ డిజైనర్ ప్రోటీన్ ఉత్పత్తి అయ్యేందుకు ఎలుకల మెదడులోకి జనెటిక్ ఇన్ఫర్మేషన్ (hyper-interleukin-6)ను ఇంజెక్ట్ చేసినట్టు తెలిపారు. ఈ ట్రీట్ మెంట్‌తో మరిన్ని మెరుగైన ఫలితాలు వచ్చేలా పరిశోధక బృందం పరిశోధన చేస్తోంది. ఈ తరహా విధానం అతిపెద్ద క్షీరదాల్లో కూడా ఎలా పనిచేస్తుందో పరిశోధించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ముందుగా పందులు, కుక్కలు లేదా ప్రైమేట్లపై పరిశోధన చేయాలని భావిస్తున్నామని పరిశోధకుల్లో ఒకరైన Dietmar Fischer వెల్లడించారు. ఈ థెరపీ విధానం.. జంతువుల్లో విజయవంతమైతే.. ఆ వెంటనే మనుషుల్లో కూడా సురక్షితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. కానీ, దీనికి మరిన్ని ఏళ్ల సమయం పట్టొచ్చునని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.