బాగా నిద్ర పొయే మహిళల్లో ప్రెగ్నెన్సీ అవకాశాలు రెండింతలు..!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నిద్రే ఆరోగ్యం.. కంటి నిండా నిద్ర ఎంతో అవసరం కూడా.. నిద్రలేమి సమస్యలతో బాధపడేవారంతా ఇలాంటి నిద్ర కోసం పరితపిస్తు ఉంటారు. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలంటే ప్రతిఒక్కరూ ప్రశాంతంగా నిద్రపోవాలని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందులోనూ పగలు కంటే రాత్రిళ్లూ నిద్రపోతే మంచి ఆరోగ్యమంటున్నారు. అదే మహిళల్లో అయితే మరి మంచిదంటున్నారు. ఎక్కువగా నిద్ర పోయే పెళ్లైన మహిళల్లో గర్భం దాల్చే అవకాశాలను రెండింతలు చేస్తుందని అధ్యయనం చెబుతోంది. ఒక రాత్రి 8 గంటల నిద్రతో హార్మోన్లను సమతుల్యం చేస్తుంది.

ఒత్తిడిని కూడా తగ్గించి సంతానోత్పత్తిని పెంచుతుందని సైంటిస్టులు పేర్కొన్నారు. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్న జంటలలో, మంచి నిద్రతో గర్భవతి అయ్యే అవకాశాన్ని 91 శాతం పెంచిందని తేలింది. ఇండిపెండెంట్ స్లీప్ ఎక్స్ పర్ట్ Neil Stanley ప్రకారం.. మహిళల్లో ఎవరైనా గర్భం దాల్చాలని భావిస్తే… మంచి నిద్ర పోవాలని సూచిస్తున్నారు. ‘మంచి రాత్రి నిద్ర కావాలి. ఉదయం లేదా భోజన సమయంలో శృంగారం చేయాలని సూచించారు. IVF చికిత్స పొందుతున్న దాదాపు 200 మంది మహిళలను భారతదేశ పరిశోధకులు ప్రశ్నించారు.
Getting a good night’s sleep can double a woman’s chances of getting pregnantరాత్రికి 8 గంటల నిద్రపోయిన వారిలో 44 శాతం మంది గర్భం దాల్చారు. యూరోపియన్ సొసైటీ ఫర్ హ్యూమన్ రిప్రొడక్షన్ అండ్ ఎంబ్రియాలజీ డేటా చూపించింది. 6 గంటల వరకు నిద్ర పోయినవారు 23 శాతంగా ఉన్నారు. ఆరుగురు UK జంటలలో ఒకరికి గర్భం ధరించడంలో ఇబ్బందులు ఉన్నట్టు చెబుతున్నారు. IVF రోగులకు మాత్రమే కాకుండా, నిద్ర సలహా అందరికీ వర్తిస్తుందని నిపుణులు అంటున్నారు. క్రియేట్ ఫెర్టిలిటీ క్లినిక్‌ల ప్రొఫెసర్ గీతా నర్గుండ్ అభిప్రాయం ప్రకారం.. తగినంత నిద్ర పోవడం వల్ల హార్మోన్ల సమతుల్యం చేస్తుందని, ఫలితంగా ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చునని సైంటిస్టులు సూచిస్తున్నారు.

Related Posts