కంటినిండా నిద్రపోండి.. 42శాతం గుండెజబ్బుల ముప్పు తప్పినట్టే!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Sleep Linked to 42% Lower Risk of Heart Failure : తగినంతగా నిద్రపోతున్నారా? నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.

కంటినిండా నిద్రపోకపోతే అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.

తగనంతంగా నిద్రపోనివారిలో గుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో అధిక ముప్పు ఉంటుందని అంటున్నారు.హార్ట్ ఫెయిల్యూర్ వంటి అనారోగ్య సమస్యలకు కంటినిండా నిద్రపోయినవారిలో 42శాతం తక్కువ ముప్పు ఉంటుందని వెల్లడించారు.

అమెరికాలో మూడో వంతు మంది తగినంతంగా నిద్రపోవడం లేదని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) కొత్త అధ్యయనంలో పేర్కొంది.రాత్రి పొద్దుపోయాక నిద్రపోయేవారిలో దీర్ఘకాలిక తీవ్ర అనారోగ్యానికి దారితీసే ప్రమాదం ఉందని కొత్త పరిశోధనలో వెల్లడైంది.

రోజుకో గుడ్డు తింటున్నారా? మీ ఆరోగ్యంలో ఈ మార్పులు గమనించారా?


Right Amount of Sleep Linked to 42% Lower Risk of Heart Failure

దీనికి సంబంధించి అధ్యయనం merican Heart Association (AHA) జనరల్ సర్క్యూలేషన్ లో ప్రచురించారు.

తరచుగా సరిగా నిద్రపోనివారితో పోలిస్తే.. ఆరోగ్యకరమైన నిద్ర ఉన్నవారిలో 42శాతం హార్ట్ ఫెయిల్యూర్ తక్కువ ముప్పు ఉంటుందని తేలింది.నిద్రలేమితో బాధపడేవారిలో నిద్ర తక్కువగానూ లేదా ఎక్కువగా నిద్రపోతుంటారని డాక్టర్ స్టీవెన్ హెచ్ Feinsilver పేర్కొన్నారు.

ఒక రాత్రిలో మనిషి నిద్రించే సమయం సగటున 7 గంటలు, 1/4 గంటలు అవసరం పడుతుంది.

ఎవరైతే తక్కువగా నిద్రపోతారో వారు తొందరగా మృత్యువుకు చేరువయ్యే ముప్పు ఉందని అధ్యయన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.అధ్యయనంలో భాగంగా 5 రకాల నిద్ర అలవాట్లపై వైద్యులు లోతుగా విశ్లేషించారు.

ఆరోగ్యకరమైన నిద్రకు హార్ట్ ఫెయిల్యూర్ కు మధ్య సంబంధం ఉందని తేల్చారు.

37ఏళ్ల వయస్సు నుంచి 73 ఏళ్ల వయస్సు వారు దాదాపు 4లక్షల మంది డేటాను పరిశోధకులు అధ్యయనం చేశారు.

పదేళ్ల సమయంలో వీరిలో హార్ట్ ఫెయిల్యూర్ కేసులు 5వేలకు పైగా రికార్డు అయినట్టు తెలిపారు. నిద్ర నాణ్యత, నిద్ర నమూనాలను రీసెర్చర్లు పరిశీలించారు.
ఇందులో ఎంతసేపు నిద్రించారు, ఇన్సోమ్నియా, గురక సహా ఇతర కారకాలుగా గుర్తించారు.

పగటిపూట ఎక్కువగా నిద్రపోయేవారిలోనూ గుండెజబ్బుల వంటి అనారోగ్యాల ముప్పు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

అందుకే రాత్రి నిద్ర ఎంతో ఆరోగ్యమని చెబుతున్నారు.

గుండె వైఫల్యం వంటి అనారోగ్య సమస్యల ముప్పు తగ్గించుకోవాలంటే ఆరోగ్య పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎంతసేపు నిద్రపపోవాలో తెలుసుకుందాం.

రోజుకు 7 గంటలు లేదా అంతకంటే తక్కువగా నిద్రపోవడం. రోజుకు 7 గంటల నుంచి 8 గంటలు నిద్రపోవాలి. రోజుకు 9 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం నిద్రపోవడం.

హార్ట్ రిస్క్ తగ్గించే నిద్ర అలవాట్లు :
నిద్ర అలవాట్లతో అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

నిద్రలేమితో డయాబెటిస్, హై బ్లడ్ ప్రెజర్, అధికంగా మందులు వాడటం వంటి ద్వారా కూడా ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని అంటున్నారు.సరిగా నిద్రపోనివారితో పోలిస్తే.. తగినంతంగా నిద్రపోయేవారిలో మంచి నిద్ర అలవాటు ఉన్నవారిలో హార్ట్ ఫెయిల్యూర్ ముప్పు 42 శాతం తగ్గినట్టు రీసెర్చర్లు నిర్ధారించారు.

తగినంతగా నిద్రపోతే హార్ట్ ఫెయిల్యూర్ ముప్పు.. 8 శాతం తక్కువగా ఉంటుంది.

7నుంచి 8 గంటలు నిద్రపోయేవారిలో 12శాతం, తరచుగా నిద్రలేమి లేనివారిలో 17 శాతం తక్కువగా ముప్పు ఉంటుంది.

నిద్రలేమి అంటే.. నిద్రపట్టకపోవడం, నిద్రపోవాలంటే కష్టంగా ఉండటం వంటి అనేక రుగ్మతలు తలెత్తుతాయి.

పగటి నిద్రపోయేవారిలో 34శాతం హార్ట్ ఫెయిల్యూర్ తక్కువ ముప్పు ఉంటుందని నిర్ధారించామని పరిశోధకులు వెల్లడించారు.

గుండె ఆరోగ్యంపై నిద్రలేమి ప్రభావం :
నిద్రలేమి అనేక విధాలుగా గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని టెక్సాస్ హెల్త్ హరీస్ మెథోడిస్ట్ హాస్పటిల్, కార్డియాలిజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గుడిమెట్ల అన్నారు.రక్తపోటు అనేది ఒక మెకానిజమన్నారు. పగటి సమయంలో కంటే నిద్రించే సమయంలో రక్తపోటు చాలా తక్కువగా ఉండాలని అది కూడా 120/70 కంటే తక్కువగా ఉండాలని సూచించారు.

నిద్రలేమి సమస్యలు ఉన్నవారిలో రక్తపోటు దీర్ఘకాలం పాటు అధికంగా ఉండే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

నిద్రలేమితో ఊబకాయం :
ఊబకాయం అనేది.. గుండె సంబంధిత వ్యాధులకు అతిపెద్ద అనారోగ్య ముప్పు.. నిద్రలేమితో బాధపడేవారిలో గుండెజబ్బులు చాలా సర్వసాధారణం కూడా.

తగినంత నిద్రలేనివారిలో అనారోగ్యంతో పాటు బరువు కూడా తగ్గిపోతారు. సరైన నిద్ర లేకుంటే గుండె జబ్బులకు దారితీస్తుంది.

అధిక రక్తపోటు పెరిగి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని Feinsilver హెచ్చరించారు.

Related Tags :

Related Posts :