పేషెంట్‌తో ప్రేమాయణం, పెళ్లి చేసుకోమనే సరికి…

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Crime News: Doctor dates married patient : వైద్యం కోసం తన దగ్గరకు వచ్చే ఒక పేషెంట్ తో డాక్టర్ ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి పోయారు. అప్పటికే ఇద్దరికీ పెళ్లైంది… కనుక డేటింగ్ చేయటం మొదలెట్టారు.

ప్రేమలో మాధుర్యాని చవి చూస్తున్నారు. ఇదే ఆనందం జీవితాంతం కావాలని కోరుకున్న మహిళ తనతో సహజీవనం చేయమని…..లేదా పెళ్లి చేసుకోమని డాక్టర్ని ఒత్తిడి చేయసాగింది. అందుకు ఇష్టంలేని డాక్టర్ తన తెలివితో మహిళను హత్య చేసాడు.

పీపీఈ కిట్ ధరించి సినిమా పాటకు స్టెప్పులేసిన డాక్టర్


ఘజియాబాద్ కు చెందిన డాక్టర్. ఇస్మాయిల్ (33) దాస్నాలో గత 5 ఏళ్లుగా క్లినిక్ నిర్వహిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం ఉబ్బసం, శ్వాసకోస సమస్యలతో బాధ పడుతూ ఒక మహిళ ట్రీట్ మెంట్ కోసం డాక్టర్ వద్దకు వచ్చింది. డాక్టర్ ఇచ్చిన మందులతో ఆమెకు రోగం కాస్త తగ్గుముఖం పట్టింది. ఆమెకు పెళ్లై నలుగురు పిల్లలు ఉన్నారు. రోగం తగ్గు ముఖం పట్టటంతో డాక్టర్ వద్దే వైద్యం కొనసాగిస్తోంది.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. డాక్టర్ కు కూడా వివాహం అయ్యింది. ఇద్దరూ ప్రేమలో కొత్త ఆనందాల్ని చవి చూస్తున్నారు. ఈ ఆనందం కలకాలం కావాలని కోరుకుంది ఆ మహిళ. తనతో సహజీవనం చేయమని కోరింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చెయ్యసాగింది. డాక్టర్ కు పెళ్ళి అవటంతో ఆమెతో సహజీవనం చేయటానికి….. ఆమెను పెళ్లి చేసుకోటానికి నిరాకరించాడు. ప్రేమను కొనసాగించటానికే మొగ్గు చూపాడు.

కానీ….ఆ మహిళ అందుకు ఒప్పుకోలేదు. తనతో సహజీవనం చేయాలని కోరింది. డాక్టర్ చెప్పినప్పటికీ ఆమె వినలేదు. డాక్టర్ తోజీవితం పంచుకోవాలని ఆయనపై ఒత్తిడి చేయసాగింది. ఆమె ఒత్తిడి నుంచి తప్పించుకోటానికి డాక్టర్ ఇస్మాయిల్ ప్లాన్ వేశాడు.కాగా….. ఆ మహిళ సెప్టెంబర్ 7వ తేదీనుంచి కనిపించకుండా పోయింది. తన భార్య కనిపించటంలేదంటూ ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళకోసం గాలింపు చేపట్టారు. అయినా మహిళ ఆచూకి లభ్యం కాలేదు.

మీ వల్లే కోలుకున్నా.. డాక్టర్స్‌కు థ్యాంక్స్ తెలిపిన తమన్నా..


దీంతో రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకు మహిళ వివరాలతో సమాచారం పంపించారు. అక్టోబర్ 7వ తేదీన కురుక్షేత్ర వద్ద బయటపడిన మహిళ మృతదేహాన్ని…. ఘజియాబాద్ లో తప్పిపోయిన మహిళ మృతదేహాంగా గుర్తించారు.మహిళ కాల్ డేటాను పరిశీలించిన పోలీసులకు డాక్టర్ ఇస్మాయిల్ పై అనుమానం కలిగింది. ఇస్మాయిల్ ను అదుపులోకితీసుకుని ప్రశ్నించిన పోలీసులకు నిజం వెల్లడించాడు. మహిళను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తనను ప్రేమిస్తున్న మహిళ పెళ్లి చేసుకోమని…సహజీవనం చేయమని ఒత్తిడి చేయటంతో సెప్టెంబర్ 7వ తేదీన మహిళను తనబైక్ పై ఎక్కించుకుని పహర్ గంజ్ లోని ఒక హోటల్ కు తీసుకువెళ్లాడు.మరుసటి రోజు కారు అద్దెకు తీసుకుని వచ్చిచండీఘడ్ వెళదామని ఆమెతో కారులో బయలు దేరాడు. చండఘడ్ వెళ్ళటం మహిళకు ఇష్టంలేదు. దాంతో ఆమె డాక్టర్ తో గొడవపడింది. అయిష్టంగానే కారులో బయలు దేరింది. మార్గమధ్యలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మహిళకు ఉబ్బసం వ్యాధితో శ్వాస తీసుకోటానికి ఇబ్బంది పడింది.ఆమెకు వైద్యం చేసే క్రమంలో ఉబ్బసం తగ్గటానికి ఇచ్చే ఇంజెక్షన్ తో పాటు మరో డ్రగ్ కలిసి ఇంజెక్ట్ చేశాడు. స్పృహ తప్పిపడిపోయిన మహిళను టవల్ తో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం కారులోనే కురుక్షేత్ర కు వెళ్లి అక్కడ సమీపంలోని పొలాల్లో మృతదేహాన్ని పడేసి వెళ్లి పోయాడు. నిందితుడు ఇస్మాయిల్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Tags :

Related Posts :