GHMC Attacks and Siege on Pubs, Bar and Restaurants in Hyderabad

కిక్ దిగింది : పబ్స్, బార్స్‌కే చుక్కలు చూపిస్తున్నారు 

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

జీహెచ్ ఎంపీ హిస్టరీలో ఫస్ట్ టైమ్
బార్స్ అండ్ పబ్స్ పౌ జీహెచ్ ఎంసీ ఉక్కుపాదం
రూల్స్ బేఖారు చేసిన పబ్స్ అండ్ బార్స్ మేనేజ్ మెంట్
కేర్ లెస్ గా వుంటే తాట తీస్తున్న విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ 
జూబ్లిహిల్స్ లోని పలు పబ్స్, బార్స్ సీజ్ 

హైదరాబాద్ : బల్దియా చరిత్రలో తొలిసారిగా నిబంధలన  ఉల్లంఘనపై ఉక్కు పాదం మోపింది. నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నవారిపై ముప్పేట దాడి చేశారు. ఈ క్రమంలో పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్స్ పై జీహెచ్ ఎంసీ కొరడా ఝళిపిస్తోంది. జనవరి 10న తనిఖీలను తీవ్ర తరం చేసిన విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ డిపార్ట్ మెంట్ అధికారులు రూల్స్ కు ఎగెనెస్ట్ గా వ్యవహరిస్తున్న హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, అపార్ట్ మెంట్స్ వారిని హడలెత్తించారు.

బార్ అండ్ రెస్టారెంట్స్ పై బల్దియా దాడులు..సీజ్ 
2018 ఆగస్ట్ 18న బార్ అండ్ రెస్టారెంట్స్ , సబ్ ల యాజమాన్యాలతో విజిలెన్స్ డెరెక్టర్ విశ్వజిత్ కాంపాటి  సమావేశమై ఆయా భవనాలకు సంబంధించిన నిబంధలను పాటించాలని..ఇచ్చిన గడువులోపులోనే ఫైర్ ఏక్సిడెంట్ వంటి పలు నిబంధలను అమలు చేయాలని ఆదేశించారు. దీనిని పట్టించుకోకపోవటం నోటీసులను కూడా జారీ చేసినా బేఖాతరు చేసినవారిపై ముప్పేట దాడిచేసి బార్ అండ్ రెస్టారెంట్స్ ,ఆరు  సబ్ లను సీజ్ చేసి పడేశారు. 

హైదరాబాద్ లో 714 బార్స్ అండ్ పబ్స్ (అధికారికంగా)
బల్దియా అధికారిక లెక్కల ప్రకారంగా చూస్తే..గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 714 బార్లు, పబ్ లు ఉండగా..అనుమతులు లేకుండా 300 వందలకు పైగా వున్నాయి. ఈ క్రమంలో ఆయా భవనాలకు సంబంధించి ఫైర్ సేఫ్టీలను పాటించాలని బల్దియా రూల్స్ విషయంలో నోటీసులు జారీ చేశారు. ఇలా పాటించకపోవటంతో 2017 సంవత్సరంలో ముంబైలో జరిగిన ప్రమాదాలలో ఎంతోమంది ప్రాణాలను కోల్పోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నిబంధలను పట్టించుకోనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు చేసిన ఆయా యాజమాన్యాలు దానికి సంబంధించిన వివరాలను జీహెచ్ ఎంసీజీ వెబ్ సైట్ WWW.ghmc.goc.in  నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని విజిలెన్స్ డెరెక్టర్ విశ్వజిత్ కాంపాటి  తెలిపారు. 

హైదరాబాద్ లో మొత్తం పబ్బులు, బార్స్ అండ్ రెస్టారెంట్స్
హైదరాబాద్ ఎక్సైజ్ సర్కిల్ లో – 148
రంగారెడ్డి సర్కిల్ లో -103
ఈవెంట్ పర్మిషన్ పేరుతో నిర్వహించేవి – 138
సికింద్రాబాద్ సర్కిల్ లో -103 ఉండగా..
సీజ్ చేసిన బార్స్ అండ్ రెస్టారెంట్స్

జూబ్లీహిల్స్ లోని టికిషాక్స్, క్యాలన్ గోట్ రెస్టారెంట్ బార్, అర్బనేషియా కిచెన్ అండ్ బార్, ఈట్ ఇండియా కంపెనీ, రాస్తాకేష్ అండ్ బార్, శ్రీనగర్ కాలనీలోని  దుర్గా రెస్టారెంట్ అండ్ బార్స్ లను బల్దియా సీజ్ చేసింది.  
 

READ  మహిళల కోసమే : డయల్ 112 కాల్ చేయండి

Related Posts