మేయర్ పీఠమే టార్గెట్, బరిలో బంధుగణం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

GHMC Election 2020 mayor Post : గ్రేటర్ ఎన్నికల టికెట్ల విషయంలో.. టీఆర్ఎస్‌లోని కొందరు బడా నాయకులు చాలా తెలివిగా వ్యవహరించారు. మేయర్ పీఠం మహిళకు రిజర్వ్ కావడంతో.. ఆ లీడర్లు తమ కుటుంబాల్లోని మహిళలకు సీట్లు ఇప్పించుకున్నారు. మరికొందరు నేతలు.. తమ్ముళ్లు, అల్లుళ్లతో పాటు తమ బంధుగణానికి టికెట్లు తెచ్చుకొని పోటీకి దించారు. మేయర్ పీఠమే టార్గెట్‌గా మహిళలను బరిలోకి దించిన నేతలు.. వారి గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అలా.. గ్రేటర్ బరిలో నిలిచిన నాయకుల ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ?సిట్టింగ్ కార్పొరేటర్లకే ఛాన్స్ :-
జీహెచ్ఎంసీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో టీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరించింది. సమయం తక్కువగా ఉండటంతో.. మెజారిటీ స్థానాలు సిట్టింగ్‌ కార్పొరేటర్లకే కట్టబెట్టింది. వ్యతిరేకత ఎక్కువగా ఉన్న చోట్ల.. కొద్ది మంది అభ్యర్థులను మార్చింది. ఇక.. అసలు విషయానికొస్తే.. గ్రేటర్ పరిధిలో ఉన్న బడా నేతల కుటుంబసభ్యులకు కూడా పార్టీ టికెట్లిచ్చింది. కీలక నేతల కుటుంబాల్లోని వారికి ఈసారి బాగానే ప్రాధాన్యత దక్కింది. ఇందుకు.. గ్రేటర్ మేయర్ పీఠం మహిళకు రిజర్వ్ అవడమే మెయిన్ రీజన్.మహిళకు రిజర్వ్ :-
బల్దియా పీఠాన్ని.. మహిళకు రిజర్వ్ చేశారు. దీంతో.. హైదరాబాద్ టీఆర్ఎస్ బడా లీడర్లంతా.. తమ కుటుంబాల్లోని మహిళలను గ్రేటర్ బరిలోకి దించారు. మేయర్ సీటును దక్కించుకోవడమే లక్ష్యంగా.. పావులు కదుపుతున్నారు. తమ వాళ్లను.. ఎలాగైనా గెలిపించుకొని.. మేయర్ రేసులో నిలవాలన్నదే ఇప్పుడు వారి టార్గెట్‌గా తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు.. తమ ఫ్యామిలీ మెంబర్స్‌కు టికెట్లు సాధించారు. వాళ్లను బల్దియా పోరులోకి దించారు. చాలా డివిజన్లలో.. బడా నేతల సమీప బంధువులు, కుటుంబసభ్యులు ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో.. కార్పొరేటర్లుగా గెలిచిన కొందరికి.. ఈ ఎన్నికల్లోనూ అవకాశమిచ్చింది టీఆర్ఎస్.కుటుంబసభ్యులు:-
జీహెచ్ఎంసీ ఎలక్షన్ గ్రౌండ్‌లోకి దిగిన నాయకులను బంధువులను పరిశీలిస్తే.. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు కూతురు గద్వాల్ విజయలక్ష్మి.. సిట్టింగ్ కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్నారు. మేయర్ బొంతు రాంమోహన్ సతీమణి బొంతు శ్రీదేవికి కూడా టికెట్ ఇచ్చారు. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి సతీమణి స్వప్న, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మరదలు ముఠా పద్మ, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు సునరితారెడ్డి పోటీలో ఉన్నారు. వీరితో పాటు.. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమీప బంధువులు రోజా, సత్యనారాయణ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ సమీప బంధువులు కూన గౌరీష్, కూన పద్మకు అవకాశం దక్కింది. మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సమీప బంధువు శ్రీనివాసరావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సోదరుడు ప్రేమ్‌దాస్ గౌడ్‌కు.. పోటీ చేసే అవకాశం దక్కింది.గెలిపించుకొనేందుకు :-
ఇదిలా ఉంటే.. గత పాలకమండలిలో కార్పొరేటర్‌గా ఉన్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సతీమణి కాలేరు పద్మకు.. ఈసారి టికెట్ ఇవ్వలేదు టీఆర్ఎస్ హైకమాండ్. తమ కుటుంబసభ్యులను గ్రేటర్ ఎన్నికల బరిలోకి దించిన నేతలు.. మేయర్ పీఠం కోసం ఎవరి స్థాయిలో వాళ్లు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పోటీలో ఉన్న బడా నేతలకు సంబంధించిన వారిలో ఎవరో ఒకరికి మేయర్ పీఠం దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో.. వారికి సంబంధించిన లీడర్లంతా తమ వారిని గెలిపించుకునేందుకు.. ఎంతో కృషి చేస్తున్నారు.

Related Tags :

Related Posts :