లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

GHMC ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై కంగనా రనౌత్ సెటైర్లు

Published

on

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(GHMC) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలవడంపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సెటైర్లు వేశారు. GHMC ఎన్నికల ఫలితాలపై Twitter ద్వారా స్పందించిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా.. BJPని ప్రశంసిస్తూ.. కాంగ్రెస్‌కు చురకలంటించింది. గతంలో నాలుగు స్థానాలకే పరిమితమైన BJP ఈసారి ఏకంగా 48 సీట్లు కైవసం చేసుకోగా.. కాంగ్రెస్ రెండు సీట్లను మాత్రమే కైవసం చేసుకుంది.



దీనిపై ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసిన కంగనా రనౌత్.. “ప్రియమైన కాంగ్రెస్.. మీ పార్టీ అధికారంలో ఉన్న పలు రాష్ట్రాలు ”కంగన.. కంగన..” అంటూ నా నామజపం చేస్తూ గందరగోళం చేస్తున్నాయి. బీజేపీ మాత్రం క్లిష్టమైన, తమకు పట్టులేని నగరాల్లో కూడా ప్రజల హృదయాలను గెలుచుకుంటూ.. విజయం సాధిస్తోంది” అంటూ ఆమె ట్వీట్ చేసింది.



జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56 స్థానాల్లో గెలిస్తే.. బీజేపీ 48డివిజన్లలో విజయం సాధించింది. గ్రేటర్‌ ఎన్నికల్లో మొత్తం 150 డివిజన్లలో 34 లక్షల 73వేల ఓట్లు పోలయ్యాయి. 56 డివిజన్లలో గెలిచిన టీఆర్ఎస్‌.. 74 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. అటు బీజేపీ 48 డివిజన్లలో గెలిచి.. 72 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. ఈ ఫలితాలతో దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల్లో జోష్ నిండింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *