Home » భాగ్యనగర్ దశ ప్రారంభమైంది.. బీజేపీని నమ్మినందుకు కృతజ్ఞతలు: యోగి ఆదిత్యనాథ్
Published
2 months agoon
By
vamsiYogi Adityanath thanks people: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(GHMC) ఎన్నికల్లో విజయంపై దేశవ్యాప్తంగా బీజేపీ ఉత్సాహంగా ఉంది. ఈ విజయం తరువాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ‘భాగ్యానగర్’ ప్రజలు బీజేపీ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీపై, ప్రధాని మోడీ నాయకత్వంపై విశ్వాసం ఉంచారని అభిప్రాయపడ్డారు.
2016 సంవత్సరంలో నాలుగు సీట్లు గెలుచుకున్న BJP ఈసారి ఏకంగా 48 సీట్లు గెలుచుకోగా.. అంతకుముందు ఎన్నికల ప్రచారం చేసేందుకు వచ్చిన యోగి ఆదిత్యనాథ్.. బీజేపీ నాయకత్వంపై భాగ్యనగర ప్రజలు నమ్మకం పెట్టుకున్నట్లు అభిప్రాయపడ్డారు. లేటెస్ట్గా వచ్చిన ఫలితాలతో భాగ్యనగర్‌కు మహర్దశ పట్టే సమయం దగ్గరపడినట్లుగా ఆయన అభిప్రాయపడ్డారు. BJP నాయకత్వంపై అపూర్వమైన విశ్వాసం వ్యక్తం చేసినందుకు “భాగ్యానగర్” ప్రజలకు చాలా ధన్యవాదాలు అని చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు డిసెంబర్ 1న 150 సీట్లలో ఓటింగ్ జరగగా.. 149 స్థానాల్లో ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ 55, బిజెపి 48, ఎఐఐఎం 44, కాంగ్రెస్ రెండు సీట్లు గెలుచుకున్నాయి. 2016 ఎన్నికలలో టిఆర్ఎస్ 99, ఎఐఐఎం 44, బిజెపి 4, కాంగ్రెస్ రెండు, TDP ఒక సీటు గెలుచుకోగా.. మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం BJP దేశవ్యాప్తంగా ముఖ్య నాయకులు అందరినీ రంగంలోకి దింపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పార్టీ కోసం హైదరాబాద్‌లో ప్రచారం చేశారు.
ఈ సమయంలో హైదరాబాద్ పేరును ‘భాగ్యానగర్’ గా మార్చడం గురించి చర్చ జరిగింది. నవంబర్ 28న హైదరాబాద్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ కూడా మళ్ళీ ‘భాగ్యనగర్’ కావచ్చు అంటూ కామెంట్లు చెయ్యడం చర్చనీయాంశం అయ్యింది.
“भाग्यनगर” का भाग्योदय प्रारंभ हो रहा है…
हैदराबाद के निकाय चुनावों में भाजपा एवं आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व पर अभूतपूर्व विश्वास जताने के लिए “भाग्यनगर” की जनता का कोटि-कोटि धन्यवाद।
— Yogi Adityanath (@myogiadityanath) December 4, 2020