Home » ghmc elections : బ్యాలెట్ ద్వారా ఓటు వేసే విధానం
Published
2 months agoon
By
madhughmc elections 2020 : గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కు కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఓటు వేసేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రీని తరలించారు అధికారులు. 2020, డిసెంబర్ 01వ తేదీ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. కోవిడ్ నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో ఈవీఎం బదులు..బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేయనున్నారు. మరి ఓటు ఎలా వేయాలో చూద్దాం.
ఓటర్ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.
పోలింగ్ కేంద్రానికి వెళ్లగానే..మొదటి పోలింగ్ అధికారి (1) కి ఓటర్ జాబితాలో ఆ ఓటర్ పేరు ఉందో లేదో చెక్ చేస్తారు.
ఎన్నికల సంఘం గుర్తించిన 21 గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుంది.
క్రమ సంఖ్య/జాబితాలో పేరు ఉందా ? లేదా ? అనేది చూసి..అక్కడున్న పోలింగ్ ఏజెంట్లకు వినపడేలా పేరు గట్టిగా చదువుతారు.
వారు ఒకే అన్న తర్వాత..పక్కనే ఉన్న మరో సిబ్బంది వద్దకు వెళ్లాలి.
చెక్ చేసుకున్న అనంతరం ఓటు వేయడానికి అనుమతినిస్తారు.
రెండో పోలింగ్ అధికారి (2) వద్దకు వెళ్లాలి.
ఓటర్ ఎడమ చేతి చూపుడు వేలుకు సిరా మార్క్ వేస్తారు.
అనంతరం బ్యాలెట్ పేపర్ ఇస్తారు.
మూడో పోలింగ్ అధికారి (3) దగ్గరకు వెళ్లాలి. కౌంటర్ ఫైల్ పై ఓటర్ యొక్క సంతకం లేదా వేలి ముద్ర తీసుకుంటారు.
బ్యాలెట్ పత్రాన్ని క్రమపద్ధతిలో మడిచి..స్వస్తిక్ గుర్తు గల రబ్బర్ స్టాంప్ ఇస్తారు.
బ్యాలెట్ పత్రం తీసుకున్న అనంతరం సూచించిన ప్రదేశానికి వెళ్లాలి.
ఎవరూ చూడకుండా ఏర్పాటు చేసిన బాక్స్ వద్దకు వెళ్లి..బ్యాలెట్ పత్రంపై నచ్చిన అభ్యర్థి ఎన్నిక గుర్తుపై సిరా ముద్ర వేయాలి.
మరలా మడిచిన తర్వాత..ప్రిసెడింగ్ అధికారికి ఎదురుగా ఉండే బ్యాలెట్ బాక్సులో వేయాలి.
అప్పుడు మీరు ఓటు వేసినట్లు లెక్క.
కానీ ఓటు వేసే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
గుర్తు ఉన్న బాక్సులో పైకి కిందకు జరగకుండా..కరెక్టుగా గుర్తు ఉన్న గడిలో మాత్రమే సిరా ముద్ర వేయాలి.
నిర్దేశిత గీతలను దాటితే..ఆ ఓటును లెక్కించరు.
ముద్ర వేసిన అనంతరం బ్యాలెట్ పేపర్ ను తిరిగి సిబ్బంది సూచించిన విధంగానే మడత పెట్టాలి.
ఈ ఎన్నికలకు సంబంధించి జీహెచ్ఎంసీ అవగాహన కార్యక్రమాలు చేసింది. ఓటు వేయాలో..తెలుసుకొనేట్లు వీడియోలు ఉన్నాయి. వాటి ద్వారా మరింత అవగాహన పెంచుకోవచ్చు.