-
Home » GHMC Election Live Updates: గ్రేటర్ సమరం …
Big Story
GHMC Election Live Updates: గ్రేటర్ సమరం …
Published
2 months agoon
By
Mahesh
అమీర్‌పేటలో ఒక్క పోలింగ్ శాతం నమోదు..
01/12/2020,4:32PM గ్రేటర్ ఎన్నికల ఉత్సాహం ఓటర్లలో చాలా తక్కువగా కనిపిస్తుంది.
అమీర్‌పేట్ లో మొత్తం 45వేలకు పైగా ఓటర్లు ఉన్నప్పటికీ కేవలం 380మంది మాత్రమే ఓటు వేసేందుకు ఆసక్తి చూపించారు. ఇంకా ఓటింగ్ కు రెండు గంటల సమయం మాత్రమే ఉండగా ఓటర్లు ఎంత మంది వస్తారో అని ఎదురుచూస్తున్నారు పోలింగ్ అధికారులు.
ఓటు హక్కు వినియోగించుకున్న హీరో రామ్..
01/12/2020,3:07PMEnergetic Star @ramsayz casted his vote for #GHMCElections2020 pic.twitter.com/gyW6yrqj7c
— BARaju (@baraju_SuperHit) December 1, 2020
ఓటు హక్కును వినియోగించుకున్న మైహోం గ్రూపు అధినేత
01/12/2020,1:48PMజీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్. జూపల్లి రామేశ్వరరావు, ఆయన భార్య శ్రీకుమారి సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం సిరా మార్క్ ను మీడియాకు, ప్రజలకు చూపించిన ఆయన.. ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మై హోం గ్రూప్ డైరెక్టర్లు రంజిత్ రావు, రాజిత.. జూబ్లి పబ్లిక్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.
జియాగూడ పోలింగ్ బూత్ లో ఓట్ల గల్లంతు.. ఓటర్లు తీవ్ర నిరసన
01/12/2020,12:49PMహైదరాబాద్ జియాగూడ పోలింగ్ బూత్ 38లో ఓట్లు గల్లంతయ్యాయి. 914ఓట్లకు గాను 657ఓట్లు గల్లంతయ్యాయి. ఆన్లైన్ ఓటర్ లిస్ట్‌లో ఓటు ఉన్నప్పటికీ పోలింగ్ బూత్‌లో పేర్లు లేవని ఓటర్లు అంటున్నారు. ఓటర్ స్లిప్‌లు వచ్చినప్పటికీ ఓట్లు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్..సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
మొత్తం 150 డివిజన్లలో 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 74,04,286 మంది ఓటర్లు ఉన్నారు. 9,101 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. కరోనా దృష్ట్యా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఓటు వేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో ప్రతిపోలింగ్ బూత్ లో శానిటైజర్ ఏర్పాటు చేశారు. కరోనా పేషెంట్ లు కూడా ఓటు హక్కు వినియోగంచుకునేలా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు.
గచ్చిబౌలి డివిజన్ గోపన్‌పల్లిలో ఉద్రిక్తత
01/12/2020,12:18PMహైదరాబాద్ గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లిలో ఉద్రికత్త చోటుచేసుకుంది.
టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. రెండు పార్టీల కార్యకర్తల తోపులాటకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరుపార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఉద్రిక్తత పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020.. ఓటేసిన సినీ ప్రముఖులు..
01/12/2020,12:11PMజీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. జూబ్లీక్లబ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ ఓటు వేశారు. అక్కినేని నాగార్జున, అమల దంపతులు, కేటీఆర్ దంపతులు, తనికెళ్ల భరణి, పరుచూరి గోపాలకృష్ణ దంపతులు, విజయ్ దేవరకొండతదితరులు కుటుంబ సమేతంగా ఓటు వేశారు.
మంచు లక్ష్మీ, దర్శకులు తేజ, క్రిష్, శివాజీ రాజా, ఆయన తనయుడు విజయ్ రాజా, నిర్మాతలు శ్యాం ప్రసాద్ రెడ్డి, ఉషా ముల్పూరి (నాగశౌర్య తల్లి), ప్రజాకవి గద్దర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
#VijayDeverakonda with family casted his vote #GHMCElections #GHMCElection2020 pic.twitter.com/oEJyvND6wE
— BARaju (@baraju_SuperHit) December 1, 2020
సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 150 డివిజన్లలో 1122 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నగరంలో 74,04,286 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 9,101 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. కరోనా దృష్ట్యా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఓటు వేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో ప్రతిపోలింగ్ బూత్ లో శానిటైజర్ ఏర్పాటు చేశారు. కరోనా పేషెంట్ లు కూడా ఓటు హక్కు వినియోగంచుకునేలా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. అయితే పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు హక్కు వినిగియోగించుకునే అవకాశం కల్పించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై ఎస్ఈసీ నిషేధం
01/12/2020,11:45AMజీహెచ్ఎంసీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై ఎస్ఈసీ నిషేధం విధించింది. సాధారణంగా పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం వివిధ ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తాయి. అయితే ఓల్డ్ మలక్ పేటలో బ్యాలెట్ పై గుర్తులు తారుమారు కావడంతో అక్కడి పోలింగ్ ను ఎస్ఈసీ రద్దు చేసింది. రీపోలింగ్ కు ఆదేశించింది. ఎల్లుండి రీపోలింగ్ కు ఆదేశించింది. ఇవాళ సాయంత్రం ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించవద్దని ఆదేశించింది.
కూకట్ పల్లిలో టెన్షన్.. టెన్షన్..
01/12/2020,11:02AMకూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కేపీహెచ్ బీ కాలనీలో కార్యకర్తలంతా రోడ్డుపైనే బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ఓల్డ్ మలక్ పేటలో పోలింగ్ రద్దు
01/12/2020,11:02AMఓల్డ్ మలక్ పేటలో పోలింగ్ రద్దు అయింది. బ్యాలెట్ పై గుర్తులు తారుమారు కావడంతో పోలింగ్ ను రద్దు చేశారు. 26 వ నెంబర్ వార్డులో బ్యాలెట్ పేపర్ పై సీపీఐ గుర్తుకు బదులు సీపీఎం గుర్తు ముద్రితమైంది. దీనిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎల్ బి నగర్ పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత..టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
01/12/2020,10:35AMజీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా హైదరాబాద్ ఎల్ బి నగర్ పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ఆర్ కేపురం డివిజన్ పోలింగ్ బూత్ లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈక్రమంలో విక్రమ్ రెడ్డిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రెండు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఆర్ కేపురంలోని బూత్ నెంబర్ 42, 45 లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. పోలింగ్ బూతుల బయట ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు ఓటర్ స్లిప్స్ పంచే సమయంలో కొంతమంది టీఆర్ఎస్ నేతలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ బీజేపీ నేతలు గొడవకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య బాహాబాహీ జరిగింది. ఓటర్లను టీఆర్ఎస్ నేత విక్రమ్ రెడ్డి ప్రలోభపెడుతున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆర్ కేపురం డివిజన్ లో రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఘర్షణకు దిగిన ఇరుపార్టీల శ్రేణులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
జూబ్లీక్లబ్ లో ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి
01/12/2020,9:10AMజీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సినీ హీరో చిరంజీవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీక్లబ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఆయన ఓటు వేశారు. చిరంజీవితోపాటు ఆయన సతీమణి సురేఖ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరికాసేపట్లో రామ్ చరణ్ దంపతులు కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీంతోపాటు మరో ప్రముఖ నటుడు కృష్ణంరాజు కూడా ఇదే పోలింగ్ బూత్ లో ఓటు వేయనున్నారు.
జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉండే ప్రముఖులు జూబ్లీ క్లబ్ లోని పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినిగించుకుంటున్నారు. జూబ్లీక్లబ్ లోని 20, 21 పోలింగ్ కేంద్రాల పరిధిలో దాదాపు 1400 మంది ఓటర్లు ఉన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 150 డివిజన్లలో 1122 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నగరంలో 74,04,286 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 9,101 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. కరోనా దృష్ట్యా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఓటు వేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో ప్రతిపోలింగ్ బూత్ లో శానిటైజర్ ఏర్పాటు చేశారు. కరోనా పేషెంట్ లు కూడా ఓటు హక్కు వినియోగంచుకునేలా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. అయితే పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు హక్కు వినిగియోగించుకునే అవకాశం కల్పించారు.
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కేటీఆర్
01/12/2020,9:00AMజీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. మంత్రి కేటీఆర్ క్యూలైన్ లో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. నందినగర్ లోని 8 వ నెంబర్ పోలింగ్ బూత్ లో మంత్రి ఓటు వేశారు. నేతలంతా ఒక్కొక్కొరిగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోబుతున్నారు.
సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం డివిజన్లు 150…బరిలో 1122 మంది అభ్యర్థులు ఉన్నారు. 9,101 పోలింగ్ బూత్ లు , 74,04,286 మంది ఓటర్లు ఉన్నారు. కరోనా దృష్ట్యా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఓటు వేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో ప్రతిపోలింగ్ బూత్ లో శానిటైజర్ ఏర్పాటు చేశారు.
కరోనా పేషెంట్ లు కూడా ఓటు హక్కు వినియోగంచుకునేలా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. అయితే పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు హక్కు వినిగియోగించుకునే అవకాశం కల్పించారు.

బుర్రా..బుద్ధీ ఉన్నాయా నీకు? పిల్లాడితో సహా కారు ఎత్తుకుపోయి..తల్లికి క్లాస్ పీకి..వార్నింగ్ ఇచ్చిన దొంగ

వంద దాటేస్తుందా?

యూపీఐ ద్వారా పేమెంట్స్ ఆ టైంలో చేయొద్దు

ఆవు పిడకలు టేస్టీగా లేవు

Fact Check : వ్యాక్సిన్ వేయించుకున్నట్లు యాక్టింగ్ ? వీడియోలు వైరల్

నేహా శర్మ సిస్టర్ ఇషా శర్మ ఫొటోస్

ఇషా కొప్పికర్ ఇన్‌స్టా ఫొటోస్

సింగర్ శ్రేయా ఘోషల్ ఫొటోస్

కామ్మా జెఠ్మలానీ ఇప్పుడూ అలానే ఉంది!

అల్లరి పిల్ల అనుపమా పరమేశ్వరన్ ఫొటోస్

ఆవు పిడకలు టేస్టీగా లేవు

60 నిమిషాల్లో 4కిలోల నాన్‌వెజ్ తింటే.. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ గెల్చుకోవచ్చు

జో బైడెన్, కమలాకు మోదీ శుభాకాంక్షలు

ఇక ఇంటికే బియ్యం, 2,500 వాహనాలు సిద్ధం
