లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-2

గ్రేటర్‌ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తు

Published

on

GHMC polls:ప్రతి వ్యక్తి తన ఓటు హక్కును పొందేలా.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూసేందుకు, అవకాశం కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం(SEC) కృషి చేస్తుంది. ఈ క్రమంలోనే వికలాంగులకు(PWD) పోస్టల్ బ్యాలెట్ ఎంపిక ద్వారా ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చింది. PWDలతో పాటు, 80ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు మరియు కోవిడ్-పాజిటివ్ వ్యక్తులు పోస్టల్ బ్యాలెట్లకు అర్హులు అని ప్రకటించింది.ఈ క్రమంలోనే గ్రేటర్‌ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ప్రకటనలో వెల్లడించారు. ముసలివారు, వికలాంగులు, కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిన వారు www.tsec.gov.in వెబ్‌సైట్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన స్పష్టం చేశారు. భారతదేశంలో COVID-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని, కరోనా వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి ప్రమాదాన్ని అరికట్టడానికి, కమిషన్ విస్తృత నిర్ణయాలను సూచించింది.ఇక భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన COVID-19 క్రిమిసంహారక, పరిశుభ్రత మరియు నివారణకు సంబంధించి Standard operating Procedures (SOP)ను అనుసరించి GHMCకి ఎన్నికలు నిర్వహించేటప్పుడు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై జాగ్రత్తగా ఉన్నట్లు అధికారులు చెప్పారు.


గ్రేటర్ బరిలో 1122 మంది అభ్యర్ధులు


సాధారణంగా కొంతమంది ఓటర్లు, సేవా సిబ్బంది మరియు వారి భార్యలు, నిర్భంధంలో ఉన్న వ్యక్తులు మరియు ఎన్నికల విధుల్లో ఉన్న వ్యక్తులకు పోస్టల్ బ్యాలెట్లు అందించబడతాయి. అయితే ఈసారి మాత్రం కోవిడ్-19 కారణంగా ఎన్నికల సంఘం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసిన తరువాత, ఓటరు RO పంపిన సీల్డ్ ప్యాకెట్‌ను అందుకుంటారు, ఇందులో పోస్టల్ బ్యాలెట్ పేపర్, ఫారం – XXVI-A లో డిక్లరేషన్, చిన్న కవర్ ‘A’ (ఫారం- XXVII), పెద్ద కవర్ ‘B’ ( ఫారం- XXVIII) మరియు ఓటర్ల మార్గదర్శకత్వం కోసం సూచనలు ఉంటాయి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *