తండ్రిని కూర్చొబెట్టుకుని 1200కి.మీ సైకిల్ తొక్కిన జ్యోతికి CFI బంపరాఫర్

Girl who cycled 1200 km carrying father offered trial by cycling federation

లాక్ డౌన్ నేపథ్యంలో జ్యోతి(15) అనే బాలిక గాయపడిన తన తండ్రిని సైకిల్ పై కూర్చోబెట్టుకుని 1,200 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి 8రోజుల్లో చేరుకున్న విషయం గత వారం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్ నుంచి బీహార్ లోని స్వగ్రామం(1200కిలోమీటర్లు)వరకు సైకిల్ తొక్కి అందరినీ ఆశ్చర్చపర్చిన జ్యోతికి ఇప్పుడు భారత సైక్లింగ్ సమాఖ్య(Cycling Federation of India) బంపరాఫర్ ప్రకటించింది. తండ్రిని కూర్చోబెట్టుకుని 12వందల కిలోమీటర్లు జ్యోతి సైకిల్ తొక్కడంపై సైకింగ్ సమాఖ్య ఆశ్చర్య పోయింది. ఆమెతో ప్రత్యేకంగా మాటాడి ట్రయల్స్ కోసం ఢిల్లీకి రావాలని, ట్రయల్స్ లో సత్తా చాటితే, జాతీయ సైక్లింగ్ అకాడమీలో శిక్షణ ఇస్తామని తెలిపింది.

గురువారం సైకిల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(CFI)చైర్మన్ ఓన్కార్ సింగ్ మాట్లాడుతూ...జ్యోతితో ఫోన్ లో మాట్లాడటం జరిగింది. లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే వచ్చే నెలలో ఢిల్లీకి ట్రయిల్స్ కోసం పిలుస్తామని జ్యోతికి చెప్పాము. జ్యోతి ప్రయాణ,వసతి మరియు జ్యోతితో పాటు వాళ్ల నుంచి వచ్చే మరొకరి ఖర్చులు మెత్తం మేమే భర్తిస్తామని చెప్పాము. ట్రయిల్ కోసం బీహార్ నుంచి జ్యోతిని ఢిల్లీకి ఎలా తీసుకురాగలం అన్నదానిపై మా బీహార్ రాష్ట్ర యూనిట్ తో సంప్రదింపులు జరుపుతాం. ఢిల్లీలో జరిగే ట్రయిల్ లో జ్యోతి పాస్ అయినట్లయితే...న్యూఢిల్లీలోని IGI స్టేడియం కాంప్లెక్స్  దగ్గరున్న స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ నేషనల్ సైక్లింగ్ అకాడమీలో ట్రైనీగా జ్యోతి సెలక్ట్ అవుతుంది.

b.jpg

జ్యోతిని ట్రయల్ ఆఫర్ చేయడం వెనుక ఉన్న హేతుబద్దత గురించి అడుగగా.... జ్యోతిలో ఏదో తెలియని టాలెంట్ దాగి ఉందని సింగ్ సమాధానమిచ్చారు. 1200 కి.మీ సైక్లింగ్ చేయడం సగటు పని కాదని తన అభిప్రాయమన్నారు. జ్యోతి తప్పనిసరిగా బలం మరియు శారీరక ఓర్పు కలిగి ఉంటుందన్నారు. తాము దీనిని పరీక్షించాలనుకుంటున్నట్లు సింగ్ తెలిపారు.

తాము జ్యోతిని అకాడమీలో ఉన్న కంప్యూటరైజ్డ్ సైకిల్ పై కూర్చొనిబెట్టి, ఎంపిక చేయడానికి.. 7 లేదా 8 పారామీటర్స్ లో జ్యోతి సంతృప్తిపరుస్తుందో లేదో చూస్తామని, ఆ తరువాత జ్యోతి ట్రైనీలలో ఒకరిగా ఉండవచ్చని మరియు జ్యోతి ఒక్క రూపాయి కూడా ఇందుకు ఖర్చు చేయవలసిన అవసరం లేదని సింగ్ చెప్పారు.

ఈ నెల 10న చేతిలో డబ్బులేని స్థితిలో  తండ్రితో కలిసి తన ప్రయాణం ప్రారంభించిన జ్యోతి రోజుకు 100 నుంచి 150 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ ఈ నెల 18న బీహార్ లోని దర్బంగా సమీపంలోని స్వస్థలానికి చేరుకుంది. జ్యోతి తన తండ్రిని కూర్చోబెట్టుకుని సైకిల్ తొక్కుతున్న ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.

Read: వివాహాలకు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వం, కండీషన్స్ అప్లయ్

మరిన్ని తాజా వార్తలు