ప్రియుడి ఇంటి పైనుంచి దూకి ప్రియురాలి ఆత్మహత్య

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

విశాఖలో విషాదం నెలకొంది. ప్రియుడి ఇంటిపై నుంచి దూకి ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం రాయ్ పూర్ నుంచి విశాఖ వచ్చిన వైష్ణవి షణ్ముక తేజతో ప్రేమలో పడింది. మూడేళ్లుగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. అబ్బాయి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.ఒరిస్సా రాష్ట్రం రాయ్ గడ్ ప్రాంతానికి చెందిన కావేటి వైష్ణవి గత మూడు సంవత్సరాల క్రితం విశాఖపట్నంకు వచ్చింది. ఈ క్రమంలోనే బతుకుదెరువు కోసం వచ్చిన వైష్ణవి..అదే ప్రాంతానికి చెందిన షణ్ముఖ తేజ అనే వ్యక్తితో గతకొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తోంది.

ఈ ఇరువురి ప్రేమికులు విశాఖ నగరంలోని ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరి ప్రేమాయణం కాస్తా వారి తల్లిదండ్రుల వద్దకు చేరింది. ఈ క్రమంలో పెళ్లి విషయం మాట్లాడేందుకు ప్రియుడి తల్లిదండ్రుల ఇంటి దగ్గర వెళ్లినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే పెళ్లికి ప్రియుడి తల్లిదండ్రులు నిరాకరించడం, ప్రియుడు కూడా ముఖం చాటేయడంతో ఆమె మనస్థాపం చెంది ప్రియుడి అపార్ట్ మెంట్ నుంచి దూకి చనిపోయింది. ప్రస్తుతం పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నారు. కేసు నమోదు చేశారు.

నిజంగానే ఆమె పైనుంచి దూకిందా? లేదా ఎవరైనా తోసేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆమె పడిపోయిన దృశ్యాలు కూడా అనుమానానికి తావిస్తున్నాయి. ఆమె కిందపడి పోయి ఉండటం, అలాగే పై నుంచి దూకితే పడిపోయి ఉండాలి కానీ కూర్చుని ఉండటంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.షణ్ముక తేజను ప్రేమిస్తుందని తెలుసుగానీ ఇంత అఘాయిత్యానికి పాల్పడుతుందని అనుకోలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే వైష్ణవి కూడా పెళ్లికి సంబంధించి సమాచారం అందించలేదు. కేవలం పెళ్లి విషయం మాట్లాడేందుకు ప్రియుడి ఇంటికి వెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఘటన తర్వాత షణ్ముక తేజ ఏమీ స్పందించలేదు. పోలీసులు షణ్ముక తేజ ఇంటికి వెళ్లారు. అతన్ని ప్రశ్నిస్తున్నారు. ఎన్ని గంటలకు ఆమె వచ్చింది? ఏమేమీ మాట్లాడింది? ఎంత కాలంగా వీరు ప్రేమించుకుంటున్నారు.వీరి మధ్య ఏమైనా గొడవలు జరిగాయా? లేకపోతే పెళ్లి విషయం కారణంగానే ఆమె దూకి చనిపోయిందా ? షణ్ముక తేజ దీనికి ఏమైనా కారణమై ఉంటాడా అనేది పోలీసులు ప్రశ్నిస్తున్నారు. షణ్ముక ఇంట్లోనే దర్యాప్తు కొనసాగుతోంది. వైష్ణవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలిస్తున్నారు.


Related Posts