లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

వేధిస్తున్నాడని ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలు

Published

on

Girlfriend who murdered boyfriend who was harassing her : పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ధర్మవరంలో దారుణం జరిగింది. ప్రియుడిని ప్రియురాలు దారుణంగా హత్య చేసింది. ఇంటర్‌ చదువుతున్నప్పటి నుంచి తాతాజీ అనే యువకుడు పావనిని ప్రేమ పేరుతో వేధించాడు. పావని కాదనడంతో రోడ్డుపైనే ఆమె మెడలో తాళికట్టినట్టు స్థానికులు చెబుతున్నారు.

పావనిపై అనుమానం పెంచుకున్న తాతాజీ వేధిస్తున్నాడు. ఇటీవల పావని, తాతాజీ మధ్య గొడవలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో తాతాజీ మాట్లాడుకుందామంటూ పావనిని పంగిడి గ్రామానికి పిలిపించాడు. తిరిగి బైక్‌పై వెళుతున్న సమయంలో తాతాజీపై పావని కత్తితో దాడి చేసింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంవత్సరం క్రితం తమ ఇద్దరికి వివాహమైందని పావని చెబుతోంది. ఎవరికి చెప్పకుండా వివాహం చేసుకున్నాం..కొంతకాలం కలిసి ఉన్నాం..ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా దాట వేస్తున్నాడని తెలిపింది. వదిలివేయడానికి ప్రయత్నిస్తుండటంతో కొంతకాలంగా తాము గొడవలు పడుతున్నామని పావని చెబుతోంది. ఇదిలావుంటే తాతాజీ తనను వివాహం చేసుకోలేదని, ఇద్దరికి వివాహం జరగలేదని తెలిపింది.

ఇద్దరు తరచూ గొడవలు పడుతున్న నేపథ్యంలో ధర్మవరం దగ్గర కలవాలనుకుని బైక్ మీద వెళ్లారు. వేధింపులకు గురి చేస్తున్న తాతాజీని హత్య చేయాలని, లేకుంటే తన వల్ల ప్రమాదం ఉంటుందని ఊహించుకున్న పావని..ఆన్ లైన్ లో ఒక కత్తిని ఆర్డర్ చేసింది. ఆ కత్తిని తన వెంటే తీసుకొచ్చింది. బైక్ పై వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా తాతాజీని వెనక నుంచి పావని కత్తితో బలంగా పొడిచింది. తీవ్ర గాయాలైన అతను సంఘటనాస్థలంలోనే మృతి చెందాడు.

అయితే వీరిద్దరికి వివాహం జరగలేదని, కేవలం ప్రేమికులుగానే ఉన్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే హత్య చేసినట్లు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *