లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

‘ఆడపిల్లలు 15 ఏళ్లకే పిల్లల్ని కనగలరు..మరి పెళ్లి వయస్సు 21 వరకూ ఎందుకు?’: మాజీ మంత్రి వివాదాస్సద వ్యాఖ్యలు

Published

on

“Girls Can Reproduce At 15, Why Raise Age For Marriage”: ఆడపిల్లలు 15 ఏళ్లకే పిల్లల్ని కనగలరు మరి వివాహ వయస్సు 21 వరకూ ఎందుకు?’అంటూ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సజ్జన్‌ సింగ్‌ వర్మ వివాహ వయస్సుపై వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీతో పాటు పలు మహిళా సంఘాలు సజ్జన్‌ సింగ్‌ వర్మపై విమర్శలు కురిపిస్తున్నారు. బీజేపీ నేతలే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారనుకుంటే వారి లిస్టులో మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ఈ వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. కాగా సజ్జన్‌ సింగ్‌ వర్మపై కాంగ్రెస్ మహిళా సంఘాల నేతలు కూడా విమర్శలు చేయటం గమనించాల్సిన విషయం.

‘ఆడపిల్లలు 15వ ఏట నుంచే పునరుత్పత్తి చేయగలిగినప్పుడు.. వివాహ వయసును 21 ఏళ్లకు పెంచడం ఎందుకు?’ అంటూ ఓ మీడియా సమావేశంలో సజ్జన్ సింగ్ చేసిన సంచలన వ్యాఖ్యలు మధ్యప్రదేశ్‌లో రాజకీయాల్లో వివాదాన్ని రాజేశాయి. దీంతో సజ్జన్ సింగ్ ను పార్టీ నుంచి తొలగించాలంటూ బీజేపీ, మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

కాగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ‘సమ్మన్’‌ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 15 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో మహిళలపై నేరాల గురించి అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మహిళ కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచాలని సూచించారు.

దీనిపై స్పందిస్తూ.. కాంగ్రెస్ నేత సజ్జన్ సింగ్ స్పందిస్తూ..15 సంవత్సరాల వయస్సులో మహిళలు పునరుత్పత్తి చేయగలరని..ఇది కేవలం నా మాటలే కాదు..వైద్య నిపుణఉల నివేదికలే చెబుతున్నాయనీ..ఆడపిల్లలు 15 సంవత్సరాల వయస్సు నుంచే పిల్లలను కనడానికి అనుకూలంగా ఉంటారనీ తెలిపిన విషయాలంటూ తెలివితేటలు ప్రదర్శించారు. అయితే.. 18 ఏళ్ల తర్వాతనే వారు వివాహం చేసుకోవడానికి పరిణీతి చెందుతారు.

అందుకే వివాహ వయసును 18 సంవత్సరాలుగా పేర్కొన్నారు. మరి వారి వివాహ వయసును 18 నుంచి 21కి పెంచడానికి సీఎం శివరాజ్ సింగ్ ఏమైనా డాక్టరా..లేదా సైంటిస్టా?అంటూ సజ్జన్ సింగ్ వర్మ ప్రశ్నించారు. బాలికలు 18 ఏళ్లు దాటిన తర్వాత వివాహం చేసుకుని తమ అత్తమామల ఇంటికి వెళ్లి సంతోషంగా ఉండాలని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.

సజ్జన్‌ సింగ్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రాహుల్‌ కొఠారి మాట్లాడుతూ.. ‘‘సజ్జన్‌ సింగ్‌ కేవలం మధ్యప్రదేశ్‌ ఆడపిల్లల గురించే కాకుండా..దేశవ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డలని తన వ్యాఖ్యలతో అవమానించారు..తన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, యంగ్‌ నేషనల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఇద్దరు మహిళలనే విషయం బహుశా సజ్జన్‌ సింగ్‌ మర్చిపోయినట్లున్నారు అంటూ చురకలంటించారు.ఆడపిల్లల గురించి ఆయన అన్న మాటలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని సోనియా గాంధీ సజ్జన్‌ సింగ్‌ని ఆదేశించాలని డిమాండ్ చేశారు..క్షమాపణలు చెప్పించి సజ్జన్ సింగ్ ను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలపై పిల్లల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ సజ్జన్ సింగ్ కు నోటీసులు జారీ చేసింది. దీనిపై రెండు రోజుల్లో వివరణలు ఇవ్వాలనీ..నోటీసులు జారీ చేసింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *