నదిలో నటి మృతదేహం లభ్యం.. కుమారుడు సేఫ్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

గతకొద్ది రోజులుగా వివిధ భాషలకు చెందిన సినీ పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖుల వరుస మరణాలతో ఆయా ఇండస్ట్రీలు తీవ్రంగా కలవరపడుతున్నాయి. ప్రముఖ హాలీవుడ్‌ నటుడు జాన్‌ ట్రవోల్టా భార్య, నటి కెల్లీ ప్రీస్టన్‌ (57), ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి దివ్య చౌక్సే క్యాన్సరుతో మరణించారన్న వార్త మరచిపోకముందే మరో నటి ఇక లేదు అనే వార్త తెలిసింది.
వివరాళ్లోకివెళ్తే.. ఐదు రోజుల నుంచి కనిపించకుండా పోయినా ప్రముఖ హాలీవుడ్ నటి నయా రివీరా (Naya Rivera) మృతదేహాన్ని పెరూలేక్‌లో గుర్తించారు పోలీసులు. ‘గ్లీ’ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రివీరా. ఐదు రోజుల క్రితం కాలిఫోర్నియాలోని పెరూ లేక్‌లో ఓ బోటును అద్దెకు తీసుకుని తన నాలుగేళ్ల కుమారిడితో కలిసి బోటు షికారుకు వెళ్లిందామె. సాయంత్రం అయినా బోట్‌ తిరిగి రాకపోవడంతో.. బోటు యజమాని పోలీసులకు, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టాడు.

Naya Rivera

ఈ క్రమంలో బుధవారం సాయంత్రం బోటు కనిపించింది. దానిలో రివీరా కుమారుడు ఒక్కడే పడుకుని ఉన్నాడు. పిల్లాడి పక్కనే ఓ లైఫ్‌ జాకెట్‌, రివీరా పర్స్‌ ఉన్నాయి. ‘నేను, అమ్మ ఈత కొట్టడానికి వెళ్లాం. నేను తిరిగి వచ్చాను. కానీ అమ్మ ఇంకా రాలేదు’ అని పిల్లాడు రివీరా కుటుంబ సభ్యులకు తెలిపాడు. దాంతో నటి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావించారు పోలీసులు. ఈ క్రమంలో ఆమె మృతదేహం కోసం గాలింపు చేపట్టారు.

దాదాపు ఐదు రోజుల పాటు లేక్‌ను జల్లెడ పట్టిన పోలీసులు నిన్న సాయంత్రం రివీరా మృతదేహాన్ని గుర్తించారు. ఫాక్స్‌ మ్యూజికల్‌ కామేడి చిత్రం ‘గ్లీ’ ఆరు సీజన్‌లలో రివీరా పాటలు పాడే చీర్‌ లీడర్‌ సంటాన లోపెజ్‌ పాత్రలో నటించింది. రివీరా మృతదేహం లభ్యమైనచోట ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ‘గ్లీ’ చిత్రబృందం కూడా నివాళులు అర్పించారు.

 

Related Posts