బిగ్‌బాస్ 4 గ్లింప్స్.. గోపి ఎవరో తెలుసా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ 4వ సీజన్‌కు కింగ్ నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గత మూడేళ్లుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న ‘బిగ్‌బాస్’ కార్యక్రమం నాలుగో సీజన్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా కారణంగా ఆలస్యమైంది. గత సీజన్‌ను హోస్ట్ చేసిన నాగార్జున ఈ సీజన్‌కు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు.

తాజాగా ఈ సీజన్‌కు సంబంధించిన ప్రోమో(గ్లింప్స్) విడుదల చేశారు. ప్రోమోలో నాగార్జున ఓల్డ్ గెటప్‌లో దర్శనమిచ్చారు. బయోస్కోప్ పట్టుకుని ఎవరినో ‘గోపీ’ అని పిలుస్తున్నారు. ‘తర్వాత ఏం జరిగిందో తెలుసా’ అంటూ ప్రోమోను ముగించారు. దీంతో ‘గోపీ ఎవరు’ అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

గత సీజన్‌లో కోతి బొమ్మ పట్టుకుని ‘పండు’ అంటూ సందడి చేసిన నాగ్ ఈ ఏడాది ‘గోపీ’ అనే క్యారెక్టర్‌ను పరిచయం చేయబోతున్నట్టు తెలుస్తోంది.. అలాగే నాగ్ యంగ్ అండ్ ఓల్డ్ గెటప్స్‌లో కనిపించనున్నారట. బిగ్‌బాస్ సీజన్ 4 ఈ నెల 30నుంచి ప్రారంభం కానుందని సమాచారం.

Related Posts