లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Business

దేవుడే దిగి వచ్చినా : నంబర్లు మార్చడంపై ఇన్ఫీ ఛైర్మన్ వివరణ

Published

on

God Could Not Change Its Numbers Infosys Chairman Nilekani

దేవుడే దిగి వచ్చినా..తాము తప్పుడు లెక్కలు రాయబోమని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని స్పష్టం చేశారు. ఫిర్యాదుల వెనుక సహ వ్యవస్థాపకులు, కొందరు మాజీ ఉద్యోగుల హస్తం ఉందంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన ఖండించారు. ఇవి హేయమైన ఆరోపణలని, వ్యవస్థాపకుల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు..జరుగుతున్న ప్రయత్నాలని ఆయన వ్యాఖ్యానించారు. సీఈవో సలిల్ పరేఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ అనైతిక విధానాలకు పాల్పడుతున్నారంటూ..ప్రజా వేగుల ఫిర్యాదులు అవమానకరమన్నారు. ఈ క్రమంలో నీలేకని వివరణ ఇవ్వడం..ప్రాధాన్యత సంతరించుకుంది. 2019, నవంబర్ 06వ తేదీ బుధవారం మీడియాతో మాట్లాడారు. 

వదంతులు హేయమైనవని, అంతా ఎంతగానో గౌరవించే..వ్యక్తుల ప్రతిష్టను మసకబార్చే..లక్ష్యంతో చేస్తున్నవని, సంస్థకు జీవితాంతం సేవలు అందించిన మా సహ – వ్యవస్థాకులంటే..తనకెంతో గౌరవమన్నారు. వారు కంపెనీ వృద్ధి కోసం నిస్వార్థంగా కృషి చేశారని, భవిష్యత్‌లోనూ కంపెనీ శ్రేయస్సు కోసం పాటు పడేందుకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. టాప్ మేనేజ్ మెంట్‌పై వచ్చిన ఆరోపణల మీద ఇప్పటికే స్వతంత్ర న్యాయ సేవల సంస్థ విచారణ జరుపుతోందని, ఫలితాలు వచ్చాక..అందరికీ తెలియచేస్తామని నీలేకని వెల్లడించారు. 

మరోవైపు ప్రజావేగుల ఫిర్యాదులకు సంబంధించి నిర్దిష్ట వివరివ్వాలని నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథార్టీ (ఎన్ఎఫ్ఆర్ఏ), కర్ణాటకలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కోరినట్లు ఇన్ఫీ తెలిపింది. ఎక్చ్సేంజీలు ఎస్ఎస్ఈ, బీఎస్ఈలు కూడా మరింత సమాచారం అడిగినట్లు, అడిగిన వివరాలన్నింటినీ సమర్పించనున్నట్లు వివరించింది. అటు అమెరికన్ ఇన్వెస్టర్ల తరపున అమెరికాలో క్లాస్ యాక్షన్ దావా వేస్తామంటూ..ఒక న్యాయ సేవల సంస్థ ప్రకటించింది. 
Read More : రెండేళ్ల తర్వాత బయటకు: డేరా బాబా కేసులో హనిప్రీత్‌కు బెయిల్

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *