Home » Gold Rate : బంగారం ధర పై పైకి…
Published
2 years agoon
By
madhuమళ్లీ బంగారం ధర పైకి ఎగబాకుతోంది. ధరలు తగ్గే అవకాశాలు కనిపించడం లేదని..ఈ ఏడాదిలో పెరిగే ఛాన్స్లున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. 10 గ్రాముల బంగారం ధర దాదాపు గత 3ఏళ్లుగా రూ. 30 వేల నుండి రూ. 32వేల 500 మధ్య ఉంది. ధరలు పెరగడంతో 10 గ్రాముల (24 క్యారెట్లు) రూ. 34వేలకు చేరుకుంది. కేంద్ర బ్యాంకుల నుండి వస్తున్న డిమాండ్…రిటైల్ కొనుగోళ్లు పెరగడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు.
– హైదరాబాద్లో ఫిబ్రవరి 16వ తేదీ శనివారం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 34 వేల 430వద్ద స్థిరపడింది.
– విజయవాడలో ఫిబ్రవరి 16వ తేదీ శనివారం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 34 వేలకు చేరుకుంది.
– విశాఖపట్టణంలో ఫిబ్రవరి 16వ తేదీ శనివారం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 34 వేల 270కు పెరిగింది.