gold rates hike

భగ్గుమన్న బంగారం : రూ.39వేలకి చేరువలో

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. రోజురోజుకి పెరుగుతున్నాయి. పసిడి ధర రూ.39వేలకి చేరువలో ఉంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.38వేల 960గా ఉంది.

బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. రోజురోజుకి పెరుగుతున్నాయి. పసిడి ధర రూ.39వేలకి చేరువలో ఉంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.38వేల 960గా ఉంది. కిలో వెండి ధర రూ.45వేల 100గా  ఉంది. జెట్ స్పీడ్‌తో పరిగెడుతున్న గోల్డ్ రేట్స్ మధ్య, సామాన్య తరగతి ప్రజలను భయపెడుతున్నాయి. ఈ ధరలతో బెంబెలెత్తిపోతున్నారు. పసిడి కొనగలమా అని వర్రీ అవుతున్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో లేనంతగా రోజు రోజుకు ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే మార్కెట్ నిపుణులు మరో బాంబు పేల్చారు. దీపావళి నాటికి బంగారం ధర రూ.40 వేలకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ తదితర కారణాలు భారత్‌లో బంగారం ధరపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని విశ్లేషించారు. కరెన్సీ రూపంలో పెట్టుబడులు పెడితే ఆర్థిక మాంద్యం వస్తే తీవ్రంగా నష్టపోతామని భయపడుతున్న ఇన్వెస్టర్లు.. గోల్డ్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో పసిడి ధరలు అంతకంతకు పెరుగుతూ పోతున్నాయి. అక్టోబర్, నవంబర్ నాటికి ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : రాజధానిపై మంత్రి కొడాలి కీలక వ్యాఖ్యలు…టీడీపీ నేతల ఉద్యమాలు కూడా ఆపలేవు

Related Posts