హైదరాబాద్‌ సిటీ బస్ పాస్ వినియోగదారులకు శుభవార్త

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Hyderabad City Bus Pass : హైదరాబాద్‌ సిటీ బస్ పాస్ వినియోగదారులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కాలంలో బస్ పాస్ ఉపయోగించుకోని వారికి మళ్ళీ సదుపాయం కల్పించనుంది. లాక్ డౌన్ లో వినియోగించుకోలేకపోయిన బస్ పాసులు తిరిగి ఉపయోగించుకునే ఛాన్స్ ఇచ్చింది.బస్ పాస్ కౌంటర్లలో పాత పాస్ లు ఇచ్చి కొత్త పాస్ లు తీసుకోవాలని సూచించింది. కోవిడ్ లాక్‌డౌన్‌లో తీసుకున్న బస్ పాస్‌లో(ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌, ఎయిర్‌పోర్ట్‌ పుష్పక్‌ ఎసీ బస్‌) ఎన్ని రోజులు ఉపయోగించుకోలేదో అన్ని రోజులు మళ్లీ ఉపయోగించుకునే అవకాశాన్ని గ్రేటర్ హైదరాబాద్‌ జోన్‌ టీఎస్‌ఆర్టీసీ కల్పించనుంది.దీంతో వినియోగదారులు అప్పటి బస్‌ పాస్‌ను కౌంటర్‌లో తిరిగి ఇచ్చేసి కొత్త కార్డు తీసుకోవాలని ఆర్టీసీ సూచించింది. కొత్త పాస్‌లో కోల్పోయిన రోజులను కలిపి పాసులు జారీ చేయనుంది. నవంబర్ 30లోగా వినియోగించుకోవాలని తెలిపింది.

Related Tags :

Related Posts :