ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Telangana RTC Employees : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర సీఎం కేసీఆర్‌ శుభవార్తను అందించారు. కోవిడ్ సమయంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతంలో 2 నెలల పాటు కోత విధించిన 50 శాతం మొత్తాన్ని చెల్లించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు.ఇందుకోసం దాదాపు రూ.130 కోట్లు వరకు విడుదల చేయాలని ఆర్థిక శాఖను కేసీఆర్ ఆదేశించారు. ఆర్టీసీలో ఉద్యోగ భద్రతపై త్వరలో విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

ఆర్టీసీపై ఆదివారం ప్రగతి భవన్‌లో సీనియర్‌ అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.అనంతరం దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు. ఇకపై హైదరాబాద్‌లో 50 శాతం బస్సులను పునరుద్ధరించాలని ఆర్టీసీ ఎండీ సునీల్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.కరోనా కారణంగా ఇప్పటి వరకు కేవలం 25 శాతం మాత్రమే బస్సులు నడుపుతున్న విషయం తెలిసిందే.

Related Tags :

Related Posts :