లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

ఉచిత దర్శనం కోసం ఎదురుచూస్తున్న శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్

Published

on

tirumala srivari devotees: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉచిత దర్శనం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సామాన్య భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతిలోని అలిపిరి దగ్గరున్న భూదేవి కాంప్లెక్స్‌లో ఈరోజు(అక్టోబర్ 26,2020) నుంచి సామాన్య భక్తులకు.. 3వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తోంది. దీంతో శ్రీవారి దర్శనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సామాన్య భక్తులకు ఊరట లభించింది. తిరుపతి అలిపిరి దగ్గరున్న భూదేవి కాంప్లెక్స్‌లో శ్రీవారి దర్శనం కోసం ఒక రోజు ముందుగా 3 వేల టోకెన్లను జారీ చేయనున్నారు. ఉదయం 5 గంటల నుంచి టోకెన్లను ఇస్తున్నారు. దర్శనం టోకెన్లు పొందిన భక్తులను మాత్రమే తిరుమలకి అనుమతిస్తామని టీటీడీ చెబుతోంది.
లాక్ డౌన్ తర్వాత దర్శనాలు పునరుద్ధరణ:
లాక్‌డౌన్ తర్వాత జూన్ 11 నుంచి శ్రీవారి ఆలయంలో దర్శనాలను టీటీడీ పునరుద్ధరించింది. ప్రారంభంలో గంటకు 500 మంది చొప్పున రోజుకు ఆరు వేల మందికి మాత్రమే దర్శనానికి అవకాశం కల్పించారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు 3వేలు, సర్వదర్శనం టికెట్లు 3 వేలు ఇచ్చేవారు. తర్వాత కొద్ది రోజుల్లోనే ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను 9 వేలకు పెంచారు. అప్పటి నుంచి కొన్ని రోజుల పాటు మొత్తం 12 వేల మందికి శ్రీవారి ఆలయంలో దర్శనం కల్పించేవారు.

ఈఎమ్ఐలు సకాలంలో చెల్లించిన వారికి కేంద్రం గుడ్ న్యూస్


భూదేవి కాంప్లెక్స్ లో సర్వ దర్శనం టోకెన్ల జారీ నిలిపివేత:
టీటీడీ ఇస్తున్న 12 వేల టోకెన్లను భక్తులు పూర్తిస్థాయిలో కొనుగోలు చేసినా.. శ్రీవారిని దర్శించుకునే భక్తుల హాజరు మాత్రం తక్కువగానే ఉండేది. అదే సమయంలో తిరుపతిలో కరోనా వైరస్ విజృంభించడం, కరోనా కేసులు పెరగడంతో తిరుపతిని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. దాంతో తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లో సర్వ దర్శనం టోకెన్ల జారీని టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది.
సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేతతో భక్తుల ఆందోళన:
ఆ తర్వాత కరోనా కేసులు పెరిగే అవకాశం ఉండటంతో టోకెన్ల జారీని ఆపేసింది. ముందస్తు సమాచారం లేకుండా సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేయడంతో.. భక్తులు ఓ దశలో ఆందోళనకు కూడా దిగారు. టీటీడీ సర్వదర్శనం టోకెన్ల జారీని పూర్తిస్థాయిలో నిలిపివేయడం అదే సమయంలో 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను పెంచడంతో చాలా విమర్శలు విన్పించాయి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను దశల వారిగా 16 వేలకు పెంచారు. అయినా ఉచిత దర్శనం టోకెన్లను మాత్రం ఇవ్వకపోవడంతో టీటీడీ ఉన్నతాధికారులు ఆధాయం కోసమే ఉచిత దర్శనం టోకెన్లు రద్దు చేసారని చాలామంది విమర్శించారు.

భక్తుల సంఖ్య 20వేలు దాటే అవకాశం:
ఎట్టకేలకు సర్వదర్శనం టోకెన్లు పునరుద్దరించడం సామాన్య భక్తులకు తీపి కబురే అని చెప్పొచ్చు. ప్రస్తుతం 16 వేల వరకూ 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు, ఇపుడు మళ్లీ ప్రారంభించిన 3 వేల ఉచిత దర్శనం టికెట్లు, ఆన్ లైన్ కళ్యాణం, వీఐపీ బ్రేక్, శ్రీవాణీ ట్రస్ట్ దాతల దర్శనం, సుభదం ప్రవేశం టికెట్లు మొత్తం కలుపుకుంటే మంగళవారం నుంచి శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 20 వేల మార్కును దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *