సూర్యుడికి టాటా చెప్పారు..60 రోజులు చీకట్లోనే!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Goodbye Sun! This town in Alaska : సూర్యుడు రాని ప్రాంతం ఉందా ? అలాంటి ప్రదేశాలు ఉన్నాయా ? అసలు సూర్యుడు లేకపోతే ప్రజలు బతకగలుగుతారా ? ఒక్క రోజు సూర్యుడు కనిపించకపోతే ? వామ్మో..అంటాం కానీ..సూర్యుడు కంటికి కనిపించడం మానేస్తే ఎలా ఉంటుంది ? ఇలాంటి ప్రదేశం భూమి మీద ఉంది. ఉత్తరాన ఉన్న ఆర్కిటిక్ సర్కిల్ మీద ఉన్న ప్రాంతాల్లో ఇది సంభవిస్తుంటుంది.అలస్కా. అమెరికాలోని ఓ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఉన్న ఒక పట్టణం పేరు Utqiagvik. ఈ పట్టణాన్ని బారో అని అంతకుముందు పిలిచేవారు. ఇక్కడ సూర్యుడు కనిపించకుండా పోయాడు. 2020, నవంబర్ 19వ తేదీ నగరానికి సూర్యుడు బై బై చెప్పాడు. మళ్లీ 2021 జనవరి 22వ తేదీన ఆ నగరంలో సూర్యుడు కనిపిస్తాడు. అప్పటి ఆ నగరం అంధకారంలో ఉండాల్సిందే.ఈ ప్రక్రియనే పోలార్ నైట్ అని పిలుస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి అక్షం వంపుగా ఉన్న కారణంగా..ఆయా ప్రదేశాల్లో చలికాలం సూర్యుడు కనిపించకుండా పోతాడని అంటున్నారు. పగటి పూట పూర్తిగా చీకటమియం అవుతుందా ? అంటే దాదాపుగా చీకటిగానే ఉంటుందని..అయితే కాస్త మందంగా వెలుతురు ఉంటుందని అల్లిసన్ చించార్ అనే మీటియారాలజిస్ట్ వెల్లడించారు. ఇక్కడ ఉండే జనాలకు ప్రతి సంవత్సరం ఇది అలావాటేనంట.

Related Tags :

Related Posts :