పాకిస్తాన్ నుంచి గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వెళ్లిపోవాల్సిందేనా!!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Pakistan: ఇంటర్నెట్, టెక్నాలజీ కంపెనీలు పాకిస్తాన్ నుంచి వదిలివెళ్లాల్సిన పరిస్థితి. ప్రభుత్వం సెన్సార్ డిజిటల్ కంటెంట్ ను అమలులోకి తీసుకురావడంతో.. తప్పేట్లు కనిపించడం లేదు. వీటి ఫలితంగా ఇస్లామిక్ దేశంగా పేరొందిన పాకిస్తాన్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు అడ్డంకులు పెడుతుందని విమర్శలు మొదలయ్యాయి.

ఆసియా ఇంటర్నెట్ సముదాయానికి గురువారం హెచ్చరికలు అందాయి. విశ్వవ్యాప్తంగా దిగ్గజాలుగా ఎదిగిన గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్ లపై ప్రభుత్వ మీడియాకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారాలు ఇచ్చేశారు.దీనిని బట్టి పాకిస్తాన్ ఇంటర్నెట్ కంపెనీలకు వ్యతిరేకంగా కొత్త చట్టాలు తీసుకొస్తుందని తెలుస్తుంది. ఈ రూల్స్ తో పరిస్థితులు ఎలా ఉంటాయోననే దానిపై చర్చలు నడుస్తున్నాయి. కొత్త రెగ్యూలేషన్ ప్రకారం.. సోషల్ మీడియా కంపెనీలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కొత్తగా 3.14మిలియన్ డాలర్ల జరిమానా కట్టాల్సి ఉంది.

ఇస్లాంను కించపరిచే విధంగా, టెర్రరిజం ప్రమోట్ చేసేలా, ద్వేషపూరితమైన వ్యాఖ్యలు, పోర్నోగ్రఫీ, నేషనల్ సెక్యూరిటీ సంబంధింత అంశాలను చూడకుండా ఉంచడాన్ని ఆపలేకపోవడంతో వారిపై యాక్షన్ కు రెడీ అయింది.

సోషల్ మీడియా కంపెనీలు పాకిస్తాన్ డిజిగ్నేటెడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు వివరణ ఇవ్వాలి. పాకిస్తాన్ డాన్ న్యూస్ పేపర్ సమాచారం ప్రకారం.. ‘ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే డేటా డిక్రిప్ట్ చేయడంతో పాటు, చదవదగ్గ, సరైన ఫార్మాట్ వంటివి పనిచేయకుండా చేశారు.

కరోనా వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్.. ఎందుకిలా? ఎవరిలో ఎలా ఉండొచ్చుంటే?


‘ఇలా చేయడం వల్ల ఫ్రీ, ఓపెన్ ఇంటర్నెట్ వాడటం ప్రజలకు వీలు కాదు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ఎకానమీ సంపాదించుకుంటుంటే పాకిస్తాన్ విషయంలో మాత్రం మూతపడుతుంది’ అని ఇంటర్నెట్ సముదాయ కంపెనీలు అంటున్నాయి. సభ్యులు కొత్త రూల్స్ ఫాలో అవడం కష్టంతో కూడుకున్న పని.. యూజర్లు, సబ్ స్క్రైబర్లకు ఈ సర్వీసులు కాస్త కష్టంగా మారతాయి.


ఖాన్ ప్రభుత్వం నుంచి వెంటనే ఎటువంటి కామెంట్ రాలేదు. రిపీటెడ్‌గా ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు అడ్డుగా మారిందని అంటున్నా ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. 2018 నుంచి సోషల్ మీడియా సైట్లలో యాంటీ పాకిస్తాన్ కామెంట్లు కనిపిస్తుండటంతో ఇలా చేసినట్లు ఖాన్ ఆఫీసు నుంచి గతంలో ఓ స్టేట్‌మెంట్ వచ్చింది.

కొత్త రెగ్యూలేషన్ ప్రకారం.. సోషల్ మీడియా కంపెనీలు.. పద్ధతి లేని కంటెంట్ ను వెబ్ సైట్ల నుంచి 24గంటల్లోగా తీసేయాలని పాకిస్తాన్ అధికారులు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం వీడియో షేరింగ్ ప్లాట్‍‌ఫాం టిక్ టాక్ ను క్లోజ్ చేసిన కొద్దొ రోజులకే పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Related Tags :

Related Posts :