గూగుల్ మెసేజెస్ యాప్ లో ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Google is rolling out end-to-end encryption : గూగుల్ కొత్త కొత్త ఫీచర్లతో ముందుకు రాబోతోంది. తర్వలోనే గూగుల్ మెసేజెస్ యాప్ లో ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ (E2E) ఫీచర్ (ఆండ్రాయిడ్ యూజర్స్‌) తీసుకరానున్నట్లు వెల్లడించింది. వాట్సాప్ తరహాలోనే ఇందులో ఆన్ లైన్ స్టేటస్, టైపింగ్, రీడ్ ఇండికేటర్స్ ఉండనున్నట్లు తెలిపింది. దీనివల్ల ఇతరులెవరు మెసేజ్‌లను చదవలేరు. కేవలం మీరు, మీరు సంభాషించే వ్యక్తి మాత్రమే వాటిని చదవగలరు.ప్రస్తుతం పరీక్ష దశల్లో ఉన్న ఈ ఫీచర్ ను 2021 ప్రథమార్థంలో యూజర్స్ కు అందుబాటులోకి తెస్తామని గూగుల్ వెల్లడించింది. ఎన్నో ఏళ్లుగా కొత్త ఫీచర్స్ లేకపోవడంతో ఎక్కువ మంది యూజర్స్ మెసేజింగ్ కోసం వాట్సాప్ తో పాటు..ఇతర యాప్స్ ను వినియోగిస్తున్నారు. వీటికి ధీటుగా పాతతరం SMS స్థానంలో ఆర్ సీఎస్ సేవలను (రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్) గూగుల్ తీసుకొచ్చింది. ఇన్ స్టా ఛాట్ ను పరిచయం చేసింది.ఇప్పటి వరకు ఈ సేవలు కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం కాగా..శుక్రవారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసినట్లు గూగుల్ వెల్లడించింది. దీని ద్వారా గ్రూప్ చాట్ తో పాటు, ఎమోజీలు, ఎక్కువ క్వాలిటీ కలిగిన ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే..ఈ సేవలను టెలికాం కంపెనీలకు వినియోగదారులకు అందించాల్సి ఉంది.

Related Tags :

Related Posts :