జాబ్ కావాలా ? Kormo Jobs App ట్రై చేయండి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నిరుద్యోగుల కోసం Google వినూత్నంగా ఆలోచించింది. సరికొత్త మొబైల్ యాప్ ను లాంచ్ చేసింది. దీనికి Kormo Jobs App పేరు పెట్టింది. ఈ ఆండ్రాయడ్ యాప్ ద్వారా నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలను పొందే అవకాశం ఉందని వెల్లడించింది.ఇండోనేషియా, బంగ్లాదేశ్ లో దేశాల్లో గూగుల్ ఈ యాప్ ను ట్రయల్ టెస్టు చేసింది. అనంతరం భారతదేశంలో ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రస్తుతం కరోనా టైంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారని, సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో నిరుద్యోగులకు, సంస్థలకు లాభం చేకూర్చేలా తాము ప్రయత్నం చేయడం జరిగిందని Kormo Jobs App రీజినల్ మేనేజర్ అండ్ ఆపరేషన్స్ లీడ్ బికీ రసెల్ వెల్లడించారు.Kormo Jobs App కి భారీ రెస్పాండ్ వస్తోందని సమాచారం. అటు నిరుద్యోగుల నుంచి, ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసుకోవాలని అనుకుంటున్న సంస్థలు ఈ యాప్ ను ఉపయోగించుకుంటున్నారు. కొన్ని ప్రముఖమైన సంస్థలు ఈ యాప్ ద్వారా అభ్యర్థులను రిక్రూట్ చేసుకొంటోంది.

ప్రస్తుతం 2 మిలియన్లకు పైగా వెరిఫైడ్ జాబ్స్ పోర్టల్ పై నమోదై ఉన్నాయని గూగుల్ వెల్లడించింది. సో..నిరుద్యోగులు..ఈ యాప్ ట్రై చేయండి.


Related Tags :

Related Posts :