లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Technology

గూగుల్ మ్యాప్స్ లో భారీ మార్పులు, పది భాషల్లో

Updated On - 5:12 pm, Wed, 27 January 21

Google Maps : గూగుల్ మ్యాప్స్ యాప్స్ లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వినియోగదారులకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు పలు భారతీయ భాషల్లో మ్యాప్స్ అందుబాటులో ఉన్నా..కొన్ని రకాల ప్రదేశాలను వాయిస్ కమాండ్ల ద్వారా గుర్తించడం కష్టతరంగా మారింది. ఇకపై ఆ ఇబ్బంది ఉండదని గూగుల్ వెల్లడిస్తోంది. కన్నడ, మళయాళం, పంజాబీ, మరాఠీ, తమిళం, హిందీ, తెలుగు, బంగ్లా, గుజరాతీ, ఒడియా భాషల్లో గూగుల్ మ్యాప్స్‌ను గతంలో కన్నా ఇప్పుడు మరింత మెరుగ్గా ఉపయోగించుకోవచ్చు.

వాయిస్ కమాండ్ల ద్వారా యూజర్లు అడిగే ప్రదేశాలను మ్యాప్స్ సులభంగా వెదికి పెడుతుంది. ఇందుకనుగుణంగా..మ్యాప్స్ యాప్ లో కొత్తగా లక్షల సంఖ్యలో పాపులర్ ప్రదేశాలకు చెందిన పేర్లను అందులో చేర్చారు. వాటిని వాయిస్ కమాండ్ల ద్వారా వెదికే అవకాశం ఉంది. తమకు సమీపంలో ఉన్న బస్టాపులు, కిరాణా షాపులు, రైల్వే స్టేషన్లు, ఇతరత్రా ప్రదేశాలను చాలా సులభంగా వెదికేందుకు వీలుంగా ఉంటుంది. ఆయా భారతీయ భాషలకు అనుగుణంగా..మ్యాప్స్ ను తీర్చిదిద్దినట్లు గూగుల్ ప్రతినిధి వెల్లడిస్తున్నారు.