Google Pay India continues Diwali scheme, how you can get a Rangoli or Flower stamp

రూ. లక్ష గెల్చుకోండి : Rangoli స్టాంపుల కోసం ఈ 6 Tips ట్రై చేయండి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మీరు Google Pay వాడుతున్నారా? గూగుల్ పే.. తమ యూజర్ల కోసం ప్రత్యేకించి ప్రవేశపెట్టిన Diwali స్కీమ్ పొడిగించింది. Diwali Stamps ఆఫర్లను నవంబర్ 11 వరకు పొడిగిస్తున్నట్టు గూగుల్ పే ప్రకటించింది. దివాళి కంటెస్ట్ లో భాగంగా రంగోలి స్టాంప్స్ గెలుచుకునే అవకాశాన్ని తమ యూజర్లకు కల్పిస్తోంది.

అందులో Diya, Flower, Lantern, Jhumka, Rangoli స్టాంపులు కావాలి. రూ.251 క్యాష్ బ్యాక్ లేదా రూ.లక్ష వరకు గెలుచుకునే ఛాన్స్ ఉంది. అయితే చాలామంది యూజర్లు తమ అకౌంట్లో రంగోలి స్టాంప్స్ సేకరించేందుకు తెగ ఆరాటపడుతున్నారు. ఎన్ని పేమెంట్స్ చేసినా మిగిలినా స్టాంపులు వస్తున్నాయే తప్ప రంగోలి స్టాంపులు మాత్రం రావడం లేదు. ఎక్కువ శాతం మందికి దివాళి స్టాంపుల్లో రంగోలి మాత్రం అంత తొందరగా రావడం లేదు. 

దీంతో యూజర్లంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఐదు స్టాంపులు కలెక్ట్ చేస్తేనే ఏదైనా గిఫ్ట్ పొందవచ్చు. గూగుల్ పే ద్వారా రూ.35 లేదా ఆపై ట్రాన్సాక్షన్ చేసిన యూజర్లకు మాత్రమే దివాళి స్టాంపులు వస్తాయి. అంతేకాదు.. DTH, బిల్ పేమెంట్స్, మొబైల్ రీఛార్జ్ చేయడం ద్వారా కూడా Diwali స్టాంపులు సంపాదించుకోవచ్చు.

ఏదొక స్టాంపు కావాలన్నా.. ఇతరులకు Gift లేదా Request ద్వారా పంపినా కూడా అవసరమైన స్టాంపులను తెచ్చుకునే ఆప్షన్ ఉంది. రంగోలి స్టాంపులు వస్తే.. రూ.251 నుంచి అదనంగా ప్రైజ్ మనీ రూ.లక్ష వరకు గెలుచుకునే అవకాశం ఉండటంతో యూజర్ల దృష్టి అంతా రంగోలి స్టాంపులపైనే పడింది. మీరు గెలుచుకున్న ప్రైజ్ మనీ నేరుగా మీ గూగుల్ పే ప్రైమరీ బ్యాంకు అకౌంట్లోనే క్రెడిట్ అవుతుంది. 

ఎలాగైనా రంగోలి స్టాంపులను దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఎన్నో రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. అయినప్పటికీ రంగోలి స్టాంపులు రావడం లేదని బాధపడిపోతున్నారు. మీరు కూడా రంగోలి స్టాంపుల కోసం సెర్చ్ చేస్తున్నారా? రంగోలి స్టాంపులను ఎలా సేకరించాలో తెలియదా? అయితే మీ అందరి కోసం ఈ 6 టిప్స్ ఓసారి ట్రై చేసి చూడండి.

కచ్చితంగా వర్క్ ఔట్ అవుతుందుని చెప్పలేం కానీ, సాధారణంగా ప్రయత్నించేవారి కంటే ఇలా ట్రై చేస్తే రంగోలి స్టాంపులు తెచ్చుకోనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లక్ష రూపాయలు గెలుచుకోలేకపోయిన కనీసం రూ. 251 మాత్రమైనా గెలుచుకునే అవకాశం ఉంది. రంగోలి స్టాంపులను సంపాదించే ఈ 6 టిప్స్ ఓసారి ట్రై చేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. 

1. మొదటి Tip :  
* Paytm అకౌంట్ ఓపెన్ చేయండి. 
* Add Money ఆప్షన్ ఎంచుకోండి.
* రూ.50 నుంచి ఆపై అమౌంట్ వ్యాలెట్లో యాడ్ చేయండి.
* గూగుల్ పే UPI ద్వారా రూ.50 పైనా ట్రాన్సాక్షన్ చేయండి.
* ఇలా చేస్తే.. Flower లేదా Ranogli స్టాంప్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ.

READ  ఫాదర్స్ డే రోజున ఇచ్చే ఈ 5 టెక్ గిఫ్ట్స్ మీకోసం.. 

2. రెండో Tip :
* అమెజాన్ లేదా Flipkart తో కనీసం రూ.50 లేదా ఆపై ఏదైనా వస్తువు కొనండి.
* BHIM UPI పేమెంట్, అడ్రస్ బార్ లో గూగుల్ పే అడ్రస్ యాడ్ చేయండి.
* గూగుల్ పే ద్వారా Pay చేసి ఐటమ్ కొనుగోలు చేయండి.
* దీని ద్వారా ఫ్లవర్ లేదా రంగోలి స్టాంపులు గెలుచుకునే ఛాన్స్ ఎక్కువ.

3. మూడో Tip :
* Recharge, Bill Payments (DTH) పేమెంట్స్ చేయండి.
* కనీసం రూ.35 లేదా ఆపైనా పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది.
* గూగుల్ పే ద్వారా మాత్రమే ఈ రీఛార్జ్, బిల్ పేమెంట్స్ చేయాలి. 
* అప్పుడు మాత్రమే రంగోలి స్టాంప్ వచ్చే అవకాశం ఉంటుంది.

4. నాల్గో Tip :
* Google Play Store నుంచి CRED App Download చేసుకోండి.
* CRED యాప్ ఇన్ స్టాల్ చేసుకుని Sign Up చేయండి.
* క్రెడిట్ కార్డులను Add చేయండి. మీ క్రెడిట్ బిల్లులను Pay చేయండి.
* Google Pay ద్వారా మాత్రమే Payments చేయాలి. 

5. ఐదో Tip :
* Diwali ఆఫర్ కింద గూగుల్ యూజర్లకు నోటిఫికేషన్లు పంపిస్తోంది.
* Mobile రీఛార్జ్ లేదా ఏదైనా Bill చెల్లింపులను గూగుల్ పేతో చేయాలి.
* ఇలా చేస్తే ఫ్లవర్ లేదా రంగోలి స్టాంపులను గెలుచుకోవచ్చు.

6. ఆరో Tip :
* మీకు Business QR కోడ్, PhonePe లేదా Google Pay లేదా PayTM అవసరం.
* మీ ఫోన్లలో QR Code సేవ్ చేసుకోండి.
* Google Payలోకి వెళ్లండి. Save చేసిన QR Codeలను స్కాన్ చేయండి.
* గూగుల్ పేలో QR Scanner ద్వారా Scan చేసి పేమెంట్ చేయాలి. 
* కనీసం రూ.50 లేదా ఆపై అమౌంట్ చెల్లిస్తే.. రంగోలి లేదా ఫ్లవర్ వచ్చే ఛాన్స్ ఉంది.

2nd Method : 
రూ.251 కావాలంటే ఇది ట్రై చేయండి :
* మీ Google Pay అకౌంట్ రీసెట్ చేయాలి.
* మీ మొబైల్ నుంచి Google Pay అకౌంట్ డిలీట్ చేయండి.
* Gmail App ఓపెన్ చేయండి. 
* మీ కుడివైపు Upper ప్రొఫైల్ పై Click చేయండి.
* ఇక్కడ మీరు Add Another Account అని చూడొచ్చు.
* Click On Google
* మీ ఫోన్ Password ఎంటర్ చేయండి.
* కొత్త గూగుల్ (Gmail) అకౌంట్ క్రియేట్ చేసుకోండి.
* Google Pay యాప్ Play store నుంచి డౌన్ లోడ్ చేయండి.
* App ఇన్ స్టాల్ చేసి మీ Bank అకౌంట్, రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ యాడ్ ఎంటర్ చేయండి.
* OTP వెరిఫై చేసుకోండి.. Pencil iconపై క్లిక్ చేయండి.
* కొత్త జీమెయిల్ అకౌంట్ తో Google Pay అకౌంట్ క్రియేట్ చేయండి.
* ఇక్కడ Google Pin ఎంటర్ చేసి Continueపై క్లిక్ చేయండి.
* Pin confirm చేసి చివరిగా Google Pay Home Pageలో Login చేయండి.
* మీ బ్యాంకు లింక్ యాడ్ చేసి, మీ బ్యాంకు అకౌంట్ వెరిఫై OTP, Debit Card వివరాలు ఇవ్వండి.

READ  Google Payలో కొత్త పేమెంట్ ఆప్షన్ : డెబిట్, క్రెడిట్ కార్డులు యాడ్ చేసుకోవచ్చు

3rd Method : 
రంగోలి.. పవర్ ఫుల్ ట్రిక్ ఇదే :
* గూగుల్ పే యాప్ ఓపెన్ చేయండి.
* Diya ఆప్షన్ వరకు స్ర్కోల్ డౌన్ చేయండి.
* కుడివైపు పైభాగంలో 3 (Dot) సెక్షన్ కనిపిస్తుంది.
* ఇక్కడ మీకు Feedback అని ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.
* Rangoli స్టాంపుపై ఆసక్తి ఉన్నట్టుగా ఒక సందేశాన్ని టైప్ చేయండి.
* చివరిగా, Arrow బటన్ పై క్లిక్ చేయండి. మీ సమస్య గూగుల్ పే టీంకు వెళ్తుంది.
* 24 గంటలు వేచి చూడండి.. PayTmలో Google Pay నుంచి Money Ad చేయండి.

Related Posts