లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Technology

తెలంగాణ పోలీసుల రిక్వెస్ట్..స్పందించిన గూగుల్, దా‘రుణ’ యాప్స్ తొలగింపు

Published

on

Telangana police request : అప్పుల పేరుతో.. ప్రాణాలు తీసిన ఆన్‌లైన్‌ లోన్‌ యాప్స్‌ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పోలీసుల ఫిర్యాదుతో.. రెండు వందలకు పైగా లోన్‌ యాప్స్‌ను ప్లేస్టోర్‌ నుంచి గూగుల్‌ తొలగించింది. మరో 450కి పైగా లోన్‌ యాప్స్‌ను తొలగించాలని గూగుల్‌కు పోలీసులు లేఖ రాశారు. పోలీసుల రిక్వెస్ట్‌తో యాప్స్‌ తొలగింపు ప్రక్రియను గూగుల్‌ మరింత వేగం చేసినట్లు తెలుస్తోంది. భారత ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ పనిచేస్తున్న యాప్స్‌ను గుర్తించడంతో పాటు.. వాటి యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తోంది.

హైదరాబాద్‌ కమిషనరేట్ నుంచి మొత్తం 288 యాప్స్‌ తొలగించాలని పోలీసులు గూగుల్‌కు రిక్వెస్ట్‌ చేశారు. సైబరాబాద్‌ కమిషనరేట్ నుంచి 110 లోన్‌ యాప్స్‌.. రాచకొండ కమిషనరేట్ నుంచి మరో 90 యాప్స్‌ను పూర్తిగా బ్యాన్‌ చేయాలని పోలీసులు గూగుల్‌ అధికారులను లేఖ ద్వారా కోరారు. మూడు కమిషనరేట్ల పరిధిలో కలిపి ఇప్పటి వరకు 450 కోట్ల రూపాయల నగదును ఫ్రీజ్‌ చేసిన పోలీసులు.. నలుగురు చైనా దేశస్తులను అరెస్ట్ చేశారు. యాప్‌ నిర్వాహకుల వేధింపుల బారినపడ్డవారు డయల్‌ 100, లేదా సమీప పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు. ఎవరూ బలవన్మరణాలకు పాల్పడవద్దని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.