Home » గూగుల్ స్పెషల్ దివాళీ ఈస్టర్ ఎగ్.. చూశారా? క్లిక్ చేస్తే ఎన్నో దియాలో.. వెలిగించండిలా..
Published
2 months agoon
By
sreehariEaster egg for Diwali : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఇండియా దీపావళి సందర్భంగా వర్చువల్ సెలబ్రేషన్స్ ద్వారా నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
దివాళీ కోసం స్పెషల్ ఈస్టర్ ఎగ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ అందించే Diwali Easter egg సెర్చ్‌లో అందుబాటులోకి ఉంది.
Diwali, Diwali festival, Diwali india అని సెర్చ్‌లో టైప్ చేస్తే చాలు.. మీకు వెంటనే గూగుల్ ఈస్టర్ ఎగ్ పేజీ కనిపిస్తుంది.
ఇంతకీ ఈ ఈస్టర్ ఎగ్ పేజీని చూడాలనుకుంటున్నారా? అయితే గూగుల్ సెర్చ్ లోకి వెళ్లండి. అక్కడ Diwali అని టైప్ చేయండి..
మీకు కుడివైపుభాగంలో సెర్చ్ రిజల్ట్స్ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ బాక్సులో Diwali గురించి వివరణ ఉంటుంది. అంతేకాదు.. దియాలు కూడా కనిపిస్తాయి.
ఏదైనా Diyaపై క్లిక్ చేస్తే చాలు.. వెంటనే అన్ లాక్ అయిపోతుంది. అనేక దియాలన్నీ పేజీలో దర్శనమిస్తాయి. దియాల వెలుగులు పేజీ మొత్తం విరజిమ్ముతూ ప్రకాశంవంతంగా కనిపిస్తాయి.
కుడివైపు స్టార్లతో వెలుగుతున్న ఒక దియాను మౌజ్‌తో క్లిక్ చేసి.. డ్రాగ్ చేస్తూ ఒక్కో పేజీపై ఉన్న దియాలను వెలిగించండి.. అంతే.. దియాల వెలుగులో స్టార్లతో గూగుల్ పేజీ మొత్తం మెరిసిపోతుంది..