గూగుల్ నుంచి కొత్త ఫీచర్.. ‘hum అన్నా.. విజిల్ వేసినా.. పాడినా’ వెతికి పెడుతుంది!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

hum to search feature : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ‘hum to search’ అనే సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. తమ సెర్చ్ టూల్స్ సెక్షన్ లో ఈ ఫీచర్ యాడ్ చేసింది.

దీనిద్వారా మీరు ఏదైనా పాట కోసం వెతకాలంటే సింపుల్ గా హుమ్.. లేదా విజిల్ వేసినా లేదా పాట పాడితే చాలు.. మీరు సెర్చ్ చేసే పాటకు సంబంధిత సెర్చ్ మీకు వెతికి పెడుతుంది.. మిషన్ లెర్నింగ్ టెక్నిక్స్ ద్వారా మీరు పాడిన పాట ఏంటో అది గుర్తిస్తుంది..గూగుల్ అందించే ఈ కొత్త యాప్… ఆండ్రాయిడ్, iOS స్టోర్లలో అందుబాటులో ఉంది. గూగుల్ అందించే ఈ కొత్త ‘hum to search’ ఫీచర్ శుక్రవారం (అక్టోబర్ 16) నుంచే అందుబాటులోకి వచ్చేసింది.

ఆండ్రాయిడ్‌లో 20 భాషలకు పైగా అందుబాటులో ఉండగా.. iOS డివైజ్ లో మాత్రం కేవలం ఇంగ్లీష్ ల్వాంగేజీలోనే అందుబాటులో ఉంది.గూగుల్ అసిస్టెంట్ ద్వారా కూడా ఈ ఫీచర్ యాక్సస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చేయాల్సిందిల్లా.. ‘What’s the song’ అని గూగుల్ అని అడగడం లేదా ‘search a song’ బటన్‌పై Tap చేస్తే చాలు.. ఇంకా సింపుల్ గా hum అని అన్నా చాలు.. వెంటనే గూగుల్ మీకు నచ్చిన పాటకు సంబంధించి మ్యాచింగ్ లింకులను వెతికి స్ర్కీన్ పైకి వెతికిపెడుతుంది.ఏదైనా సాంగ్ కోసం వెతికినా కూడా ఆ పాట పాడినా చాలు.. వెంటనే ఆ పాట రిలేటెడ్ లింక్స్ మీకు చూపిస్తుంది గూగుల్.. ఈ కొత్త ఫీచర్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ ద్వారా పనిచేస్తుంది. ఆడియోను నెంబర్ ఆధారిత సీక్వెన్స్ తో సాంగ్ మెలోడీని సెర్చ్ రిజల్ట్స్ లో వెతికి చూపిస్తుంది.

హ్యుమన్స్ సింగింగ్, విజిలింగ్ లేదా హుమ్మింగ్ వంటి సంకేతాలను కూడా ఈ ఫీచర్ సులభంగా అర్థం చేసుకోగలదు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ గూగుల్ ఫీచర్ ఓసారి ట్రై చేసి చూడండి..

Related Posts