లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Uncategorized

సీఎం రమేష్ ఇంట్లో సోదాలపై ద్వివేదీ స్పందన

టీడీపీ ఎంపీ సిఎం రమేష్‌ ఇంట్లో చేసిన సోదాలపై ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ స్పందించారు.

Published

on

Gopala Krishna Dwivedi Respond Police Inspection At CM Ramesh

టీడీపీ ఎంపీ సిఎం రమేష్‌ ఇంట్లో చేసిన సోదాలపై ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ స్పందించారు.

టీడీపీ ఎంపీ సిఎం రమేష్‌ ఇంట్లో చేసిన సోదాలపై ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ స్పందించారు. ఎన్నికల సమయంలో IT అధికారులు సోదాలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. దీనిపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు ఆరోపణలు చేస్తున్నారు. సీఎం రమేశ్ ఇంట్లో పోలీసులు తనిఖీలు జరపడంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దీనితో ద్వివేదీ స్పందించారు. సోదాలు ఎన్నికల  సమయంలో జరిగే సాధారణ తనిఖీలే అని స్పష్టం చేశారు. ఏప్రిల్ 05వ తేదీ శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…
Read Also : అవినీతి కోట తలుపులు బద్దలు కొడతా : పవన్

ఎన్నికల సమయంలో సాధారణ  ప్రక్రియలో భాగంగానే తనిఖీలు చేస్తారన్నారు. ఫ్యాక్షన్‌ ప్రభావిత గ్రామంలోని అన్ని ఇళ్లలో తనిఖీలు నిర్వహించారని, రాష్ట్రంలో మిగిలిన సమస్యాత్మక గ్రామాల్లో సైతం కార్డన్‌ సెర్చ్‌లు నిర్వహిస్తారన్నారు. పార్టీలకు అతీతంగా కార్డన్‌ సెర్చ్‌లు ఉంటాయని, పోలీసులపై వచ్చిన  ఫిర్యాదులన్ని నిజం కాకపోవచ్చన్నారు. ఒక్క ఫిర్యాదుపై వచ్చిన నివేదికల్లో ఒక్క ఆరోపణపై ఆధారాలు లేవన్నారు. రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదుపై విచారణ జరిపించామన్నారు. గుంటూరు, ప్రకాశం, కడప, చిత్తూరు  జిల్లాల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఫిర్యాదులపై జిల్లాల వారీగా ప్రత్యేక పరిశీలకుల ఆధ్వర్యంలో సమీక్షలు జరుగుతున్నాయన్నారు.

రాష్ట్రంలో 45,000 పోలింగ్  కేంద్రాలు ఉండగా సాంకేతిక సమస్యల కారణంగా 10 వేల పోలింగ్  కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేయలేకపోతున్నామని 35,000 పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రమే వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు  చేయనున్నామని తెలిపారు. మారుమూల అటవీ కేంద్రాల్లో  ఎన్నిక నిర్వహణకు సిబ్బంది, సామాగ్రీ తరలించేందుకు 24 సీటర్ల హెలికాప్టర్లను వినియోగిస్తామన్నారు. ఇటువంటి కేంద్రాలు  తూర్పు గోదావరి జిల్లాలో నాలుగైదు, విశాఖపట్నం జిల్లాలో 12  దాకా వున్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 33 కౌంటింగ్  కేంద్రాలు ఉన్నాయన్నా ద్వివేదీ..వీటిలో 50 చోట్ల వరకు కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందన్నారు.
Read Also : బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తా జగన్ హామీ

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *